ETV Bharat / state

లండన్ పర్యటనకు బయల్దేరిన మంత్రి కేటీఆర్

author img

By

Published : May 17, 2022, 3:42 AM IST

Updated : May 17, 2022, 10:07 AM IST

KTR Foreign Tour: తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పది రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

నేటి నుంచి కేటీఆర్​ విదేశీ పర్యటన.. పెట్టుబడుల సాధనే లక్ష్యం
నేటి నుంచి కేటీఆర్​ విదేశీ పర్యటన.. పెట్టుబడుల సాధనే లక్ష్యం

  • Off to the United Kingdom for three days to attend meetings organised by @UKIBC and from there on to Davos to attend the world economic forum from 22-26th May

    Lots of meetings lined up and hectic activity ahead

    — KTR (@KTRTRS) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. పది రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.

ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి తొలుత లండన్ వెళ్లనున్న కేటీఆర్ అక్కణ్నుంచి దావోస్ పయనమవుతారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​, ఇతర అధికారుల బృందం పర్యటనలో పాల్గొంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 17, 2022, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.