ETV Bharat / state

conflicts in Telangana congress : తెలంగాణ కాంగ్రెస్​లో మరో సారి భగ్గుమన్న​ అంతర్గత కలహాలు

author img

By

Published : Jan 2, 2022, 5:38 AM IST

conflicts in Telangana congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు గ్రూపు రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. అంతర్గతంగా ఉన్న విభేదాలు హిర్గతం అవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ అధ్యక్షుడు జగ్గారెడ్డిల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమంతో తెరపైకి వచ్చిన విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

Telangana congress
Telangana congress

conflicts in Telangana congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తెరపైకి వస్తున్నాయి. పైకి కలిసికట్టుగా పని చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ సీనియర్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడికి మధ్య ఉన్న అంతరం సమసి పోలేదని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఇటీవల దిల్లీలో ఏఐసీసీ సమక్షంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పరిస్థితులను అంచనా వేసిన అధిష్ఠానం గట్టి చురకలు అంటించింది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చెయ్యాలని స్పష్టం చేసింది. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు కూడా చేసింది.

సిట్టింగ్​ ఎమ్మెల్యేకు చెప్పాలిగా..

jaggareddy on revanth reddy : అప్పటి నుంచి కొన్ని రోజులు నాయకులు ఐక్యంగానే పార్టీ కార్యక్రమాలల్లో పాల్గొన్నారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తరచు బహిర్గతమవుతూనే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్తున్నారని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విభేదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, తనకు తెలియకుండా రైతు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పీఏసీ సమావేశంలో చర్చించిన తర్వాతనే పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ఆ అధికారం నాకు ఉంది..

ఇదే సమయంలో పీఏసీతో సంబంధం లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు చేసేందుకు నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రథసారథి అయినప్పటికీ స్థానిక నాయకత్వానికి సమాచారం లేకుండా పార్టీ సమావేశంలో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా నివేదిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నాలుగు పేజీల లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు.

ఆ ప్రకటనతోనే ప్రకంపనలు

jaggareddy complaint against tpcc chief : రెండు రోజుల కిందట గాంధీభవన్​లో సమావేశమైన పీసీసీ క్రమశిక్షణ కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. మెజార్టీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను కమిటీ ఛైర్మన్​ చిన్నారెడ్డి మీడియా ముందు వెల్లడించారు. ఇదే సమయంలో పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి పార్టీ నియమ నిబంధనలను ఉల్లంగించినట్లుగా కమిటీ భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనే విభేదాలను రచ్చకు కెక్కాయి.ఆ వెంటనే చిన్నారెడ్డి వ్యాఖలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. అంతే కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు పై కూడా ఫిర్యాదు చేశారు. ఈ విభేదాలు పార్టీ నాయకుల మధ్య ఎటువైపు దారి తీస్తాయో అన్న ఆందోళన పార్టీ శ్రేణులు వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: Mallu Ravi Comments On KCR: 'తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిషేధించారా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.