ETV Bharat / state

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో​ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

author img

By

Published : Jan 3, 2021, 8:55 AM IST

హైదరాబాద్​ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో అయ్యప్ప మహా పడిపూజ, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

talasani srinivas
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో​ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

అయ్యప్ప నామస్మరణతో హైదరాబాద్​ ఆదర్శనగర్​ న్యూ ఎమ్మెల్యే నివాస సముదాయం మార్మోగింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శబరిగిరీశుని మహా పడిపూజ, పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. భారీ విద్యుత్ అలంకరణ మధ్య భజన బృందాలు స్వామి పాటలతో హోరెత్తించాయి. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో​ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

ఇవీచూడండి: రామతీర్థం రగడ: అడ్డంకుల నడుమ కొండపైకి చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.