ETV Bharat / state

అగ్రోమేట్ బులిటెన్​ పరిశోధనల్లో పురోగతి: ఐఐఐటీ హైదరాబాద్

author img

By

Published : Mar 28, 2021, 4:39 PM IST

వాతావరణానికి అనుగుణంగా పంటల విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిని రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తుంటాయి. ప్రతి జిల్లాకు ఐదు రోజులకోసారి అగ్రోమేట్ బులిటెన్​ను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. అగ్రోమేట్ బులిటెన్​పై పరిశోధన చేపట్టిన ఐఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు.. ఈ ప్రక్రియను 80నుంచి 90 శాతం సులభతరం చేయటంలో పురోగతి సాధించారు.

weather research, iiit research
అగ్రోబులిటెన్​పై పరిశోధనలు, ఐఐటీ హైదరాబాద్ తాజా వార్తలు

అగ్రోబులిటెన్​పై పరిశోధనలు, ఐఐటీ హైదరాబాద్ తాజా వార్తలు

వ్యవసాయానికి వాతావవరణానికి విడదీయలేని సంబంధం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటేనే పంటలు పండుతాయి. లేకుంటే పంటలు సరిగా పండవు రైతులు కూడా నష్టపోతారు. రైతులకు ఉపయోగపడేందుకు... వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతులు వివిధ పంటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అగ్రోమేట్ బులిటెన్ ను విడుదల చేస్తాయి.

2006 నుంచి సేవలు

సూపర్ కంప్యూటర్లను ఉపయోగించుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాతావరణ సూచనలను దేశమంతటా ఇస్తుంది. 2006 నుంచి వాతావరణ ఆధారిత ఇతర సర్వీసులను ప్రారంభించారు. ఇందులో వ్యవసాయదారులకు వాతావరణ ఆధారిత సూచనలు చెప్తారు. ప్రతి జిల్లాకు ఐదు రోజులకొకసారి బులిటెన్ విడుదల చేస్తారు.

సులభతరం

కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వర్షపాత సూచన, తేమ, గాలి తీరు వంటివి ఇందులో ఉంటాయి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని వేల సంఖ్యలో ఉన్న బ్లాక్ స్థాయి బులిటెన్​ తయారు చేయటం ఇంకా క్లిష్టమైంది. డేటా సైన్స్, ఏఐ తదితర సాంకేతిక విషయంలో పరిశోధనలు చేసే ఐఐఐటీ పరిశోధకులు ఈ ప్రక్రియను సులభతరం చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాయంతో​ ఈ పరిశోధన చేపట్టాం. ఐటీని ఉపయోగించి అగ్రోమేట్ బులిటెన్ తయారు చేసే సమయాన్ని కుదించటంపై పరిశోధనలు మొదలుపెట్టాం. ఐదేళ్ల నుంచి బ్లాక్ లెవల్ అగ్రోమేట్ బులిటెన్ వివరాలను తీసుకున్నాం. బులిటెన్ తయారీ సమయాన్ని తగ్గించేందుకు డాటాను తిరిగి ఉపయోగించటంపై పరిశోధన చేశాం. రెండు బ్లాకుల్లో వాతావరణం సమానంగా ఉన్నప్పుడు .. బులిటెన్ సమానంగా ఉంటుందని గుర్తించాం.

-క్రిష్ణా రెడ్డి, ఐటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్​మెంట్ సెంటర్

ఇతర రంగాలకూ..

రాష్ట్రంలో 20 బ్లాకులకు సంబంధించిన వాతావరణ సూచనలను తీసుకొని... విశ్లేషణ చేశామన్నారు. 80 నుంచి 90 శాతం సమానంగా ఉన్నాయని తెలిపారు. ప్రతిసారీ కేవలం 10 నుంచి 15 శాతం బులిటెన్ మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు. ఈ వ్యవస్థను ఇతర రంగాలకూ ఉపయోగించుకోవచ్చని వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.