ETV Bharat / state

IAS Transfers Telangana : రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం.. త్వరలోనే ఉత్తర్వులు

author img

By

Published : Jun 29, 2023, 7:07 AM IST

IAS Transfers in Telangana 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల బదిలీ కసరత్తు కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆబ్కారీ శాఖకి కొత్త కమిషనర్లు రానున్నారు.

IAS Transfers in Telangana 2023
IAS Transfers in Telangana 2023

రాష్ట్రంలో ఐఏఎస్‌ల అధికారుల బదిలీకి రంగం సిద్ధం

IAS Officers Transfers In Telangana : రాష్ట్రంలో ఐఏఎస్​ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. నేడో, రేపో ఉత్తర్వులు వెలువనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆబ్కారీ శాఖకి కొత్త కమిషనర్లు రానున్నారు. పురపాలక శాఖకు కొత్త సంచాలకులను నియమించనున్నారు. వాటితో పాటు మరి కొంతమంది ఐఏఎస్ అధికారులకు స్థానభ్రంశం కలగనుంది.

IAS Transfers in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీ జరగనుంది. ఎన్నికల కోణంలో పలువురు అధికారులకు స్థానభ్రంశం కలగనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సైజ్ కమిషనర్లుగా కొత్తవారు రానున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న లోకేశ్‌కుమార్‌ను.. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా.. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్న సరఫరా సర్ఫరాజ్ అహ్మద్‌ని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా.. కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఆ ఇద్దరు అధికారులను ప్రభుత్వం రిలీవ్‌ చేయడం సహా ఖాళీ అయ్యే ఆ రెండు స్థానాలకు కొత్త వారిని నియమించాలి.

Telangana IAS Transfers 2023 : జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమైన ఆ పోస్టింగ్‌కి ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆబ్కారీ శాఖ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో.. ప్రభుత్వం ఎవరని నియమిస్తుందో చూడాలి. పురపాలక శాఖ సంచాలకులుగా ఉన్న సత్యనారాయణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థిరాస్తి నియంత్రణ సంస్థ రెరా ఛైర్మన్​గా నియమించింది. సత్యనారాయణ పదవీ విరమణతో ఖాళీ అయ్యే సీడీఎంఏ పోస్టులో కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. వారితో పాటు మరికొందరు ఐఏఎస్​ అధికారులకు స్థానభ్రంశం కలగనుంది.

IAS Transfers in Telangana : జీహెచ్​ఎంసీ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. శాసనసభ ఎన్నికల వేళ కీలకమైన ఆ పోస్టుకు ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందో చూడాలి. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో మూడేళ్లకు పైబడి కలెక్టర్లుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం వారి స్థానంలో మరొకరిని నియమించాలి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరికొంత మంది కలెక్టర్లను బదిలీ చేస్తారని అంటున్నారు. పలువురు ఐఏఎస్ అధికారులు వెయిటింగ్‌లో ఉన్నారు. శైలజ రామయ్యర్, హరిచందన, నిఖిల, ముషారఫ్‌ అలీ ఫరూఖీ, సత్యశారద, హైమావతి తదితరులకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఎన్నికల సమయం అయినందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బదిలీలు చేపట్టనున్నారు. కసరత్తు పూర్తైతే నేడో రేపు ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.