ETV Bharat / state

Job Fraud: ఉద్యోగాలు ఇస్తామంటూ కుచ్చుటోపీ.. ముఠా అరెస్ట్

author img

By

Published : Apr 30, 2023, 1:47 PM IST

Job Fraud
Job Fraud

Job Fraud Gang Arrest in Hyderabad: భాగ్యనగరంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టెలీ కాలర్లతో నిరుద్యోగులకు వల వేసి.. డబ్బును దోచుకుంటున్నారని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహారా తెలిపారు. ఈ ముఠా ఇతర రాష్ట్రాల నిరుద్యోగులను సైతం మోసం చేశారని అమె వివరించారు.

ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం.. ముఠా అరెస్ట్

Job Fraud Gang Arrest in Hyderabad: ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్​ఫోర్స్ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సిద్దిపేటకు చెందిన గడ్డగోని చక్రధర్ గౌడ్ బీకాం పూర్తి చేశాడని.. 2008 నుంచి ఏడాది పాటు ఎల్​ఐసీ ఏజెంట్​గా పని చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హయత్​నగర్ శాఖ కోటక్ మహేంద్రలో 2011 వరకు పని చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందన్నారు. అక్కడ పని చేసిన సాకేత్​తో ఏడాది పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్​గా పని చేసినట్లు గుర్తించారు.

నెలకు జీతం ఇస్తూనే మూడు పూటలా భోజనం, వసతి: అయితే తనకు వస్తున్న జీతం జల్సాలకు సరిపోక.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారితో పని చేశారు. ఆ అనుభవంతోనే తన స్నేహితుడు శ్రావణ్, గణేశ్​తో కలిసి పంజాగుట్టలో ఓ ఇంటిని నెలకు రూ.లక్ష 30 వేలు చెల్లిస్తూ అద్దెకు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 32 మంది టెలీ కాలర్లను నియమించుకున్నాడు. ఒక్కొక్కరికి రూ.15-19 వేలు జీతం ఇస్తూ, మూడు పూటలా భోజనం, వసతిని కూడా కల్పించాడు.

డెటా ఎంట్రీ జాబ్ ఇప్పిస్తామంటూ..: వారు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల జీతం వచ్చే డేటా ఎంట్రీ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి.. మీకు వచ్చే నెల జీతంలో వారికి కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు. ఎవరైతే ఈ మోసగాళ్ల షరతులను అంగీకరిస్తారో.. వారి నుంచి జేపీజీ ఫైల్స్ పంపించి వాటిని పీడీఎఫ్ కన్వర్ట్ చేయాలని షరతులు పెడతారని పోలీసులు వివరించారు. ఇచ్చిన పనిని పూర్తి చేసిన వారికి ముందుగా.. మీరు మాకు రావ్వాల్సిన కమీషన్ రూ.2500 తమ ఖాతాల్లో డిపాజిట్ చెయ్యాలని డిమాండ్ చేస్తారు. మిగితా జీతం మీ ఖాతాలో జమ చేస్తామంటూ చెప్తారు.

ఎవరైతే కమీషన్ డబ్బులు వేస్తారో.. వెంటనే వారి ఫోన్ నెంబర్​ను బ్లాక్ చేసేస్తారు. అయితే చాలా మంది చిన్న నగదు కదా అని ఫిర్యాదులు చెయ్యారని భావిస్తారు. ఎక్కువ మంది బాధితులు ఇతర రాష్ట్రాల వారు కావడంతో స్థానికంగా ఫిర్యాదులు పెద్దగా నమోదు కాలేదని డీసీపీ తెలిపారు. గడిచిన 45 రోజుల్లోనే 1900 మందిని మోసం చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల నగదును దోచుకున్నారని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహారా వెల్లడించారు.

వారు చాలా మందికి జాబ్ ఇస్తానని మోసం చేశారు. చక్రధర్ గౌడ్ సిద్దిపేట నేటివ్. అతను ఎల్​ఐసీ ఏజెంట్​గా కూడా పని చేస్తున్నారు. కోటక్ మహేంద్రలో కూడా పని చేశాడు. అతను పంజాగుట్టలో రూ.లక్షా 30 వేలతో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ హౌస్​లో కాల్ సెంటర్ రన్​ చేస్తున్నాడు. -స్నేహ మెహారా, సైబర్ క్రైమ్ డీసీపీ

ఇప్పటికీ 6 వేల మందిని మోసం: ప్రధాన నిర్వాహకుడు చక్రధర్ గౌడ్ ఈ మోసాన్ని 2021 నుంచి నిరంతరంగా కొనసాగిస్తున్నాడు. 45 రోజుల్లో కార్యాకలాపాలు ముగించుకొని.. తన వద్ద ఉన్న కార్డులు విరగ్గొట్టి పడేస్తాడు. ఆ తర్వాత కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేసి మరో 45 రోజులు మోసాలకు పాల్పడతాడని ట్రాస్క్​ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపారు. 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 6 వేల మందిని పైగా మోసం చేసినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ రియల్ ఎస్టేట్ చేస్తున్నానని చక్రధర్ చెప్పారని.. వారి వద్ద నుంచి 14 ల్యాప్​ట్యాప్​లు, 148 చరవాణిలు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.