ETV Bharat / state

Ganesh immersion: ట్యాంక్‌ బండ్‌పైకి చిన్న, మీడియం విగ్రహాలకు మాత్రమే అనుమతి

author img

By

Published : Sep 6, 2021, 5:18 PM IST

Ganesh immersion
Ganesh immersion

ట్యాంక్‌బండ్‌పై (Tank bund) వినాయక నిమజ్జనానికి (Ganesh immersion) పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్ రన్ చేస్తున్నట్లు తెలిపారు.

గణేష్​ నిమజ్జనానికి (Ganesh Immersion) ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ (CP Anjani Kumar) తెలిపారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్‌ రిలీజ్‌ సిస్టంను వాడుతున్నామని వెల్లడించారు. ట్యాంక్‌ బండ్‌పై (Tank bund) వినాయక నిమజ్జనానికి పోలీసులు చేస్తున్న ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు ట్యాంక్‌ బండ్‌పై చేసిన సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు.

ఆటోమేటిక్ ఐడల్‌ రిలీజ్‌ సిస్టం ద్వారా ఒక్కో విగ్రహం నిమజ్జనానికి (Ganesh Immersion) 4 నుంచి 6 నిమిషాలు తగ్గుతుందని సీపీ తెలిపారు. ప్రభుత్వం ట్యాంక్‌ బండ్‌పై సుందరీకరణ పనులు చేపట్టిందని... అవి దెబ్బ తినకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ మార్గ్​, పీవీ నరసింహ రావు మార్గ్​లో నిమజ్జనం కోసం ఎక్కువ ప్లాట్​ ఫామ్​లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెయిన్ ట్యాంక్ బండ్​లో చిన్నవి, మధ్యస్థంగా ఉన్న వినాయక విగ్రహలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 12, పీపుల్స్‌ ప్లాజాలో 8 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

'క్రేన్​ ప్లాట్​ ఫామ్ కింద ఖాళీ డ్రమ్​ పెడితే ఈ నిమజ్జనం చాలా ఫాస్ట్​గా అయింది. ఎక్స్​పర్​మెంట్ డ్రమ్​, థర్మకోల్​ ద్వారా చేశాం. ప్రతి నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాలు సేవ్ అవుతుంది. ఎన్టీఆర్ మార్గ్​, పీవీ నర్సింహ రావు మార్గ్​లో ఎక్కువ ప్లాట్​ ఫామ్​లు పెడుతున్నాం. మెయిన్ ట్యాంక్​ బండ్​లో స్మాల్​, మీడియం సైజ్​ విగ్రహల నిమజ్జనం కోసం ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సహకారం అందించాలి.'

- అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

ట్యాంక్‌ బండ్‌పైకి చిన్న, మీడియం విగ్రహాలకు మాత్రమే అనుమతి : సీపీ

ఇదీ చదవండి : బావిలో చిరుతతో పిల్లి ఫేస్​ టు ఫేస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.