ETV Bharat / state

Today Weather Report : తెలంగాణకు మరోసారి వాన గండం..!

author img

By

Published : May 6, 2023, 5:31 PM IST

Updated : May 6, 2023, 8:38 PM IST

Today Weather Report : రాబోయే 3 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

rain
rain

Today Weather Report : తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్​కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని.. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో మొదలైన వర్షం..: మరోవైపు భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, కూకట్‌పల్లి, దుండిగల్‌, మల్లంపేట్‌, గండి మైసమ్మ, సూరారం, గాగిల్లాపూర్‌, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

పొంచి ఉన్న తుపాన్‌: ఇవాళ ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ప్రోపోస్పిరిక్‌ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 8వ తేదీ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది మరుసటి రోజున వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఈ వాయుగుండం ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్ర తరమై తుపాన్‌గా బలపడే అవకాశం ఉందని సంచాలకులు ప్రకటించారు.

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. వాతావరణ శాఖ చేసిన ప్రకటనలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులతో వరి ధాన్యం చాలా వరకు నేల రాలగా.. మిగిలిన పంటను కోయడానికీ రైతులు ఇష్టపడటం లేదు. అవి కోసినా కనీసం పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు. మరికొన్ని పంటలు కోతకు సిద్దంగా ఉండగా.. తాజా ప్రకటన రైతుల్లో ఆందోళన కల్గిస్తోంది.

ఇవీ చదవండి:

Ponguleti on Crop Loss : 'రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి'

Crop Loss : కల్లాల్లో మొలకెత్తుతున్న పంట.. ఆగుతున్న రైతు గుండె

Farmers Protest in Telangana : 'కొనుగోళ్ల తీరుపై అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కి నిరసనలు'

Last Updated :May 6, 2023, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.