ETV Bharat / state

How to Check Rythu Bandhu Status 2023 : 'రైతు బంధు' డబ్బులు పడ్డాయా.. లేదా..? ఇలా చెక్ చేసుకోండి!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 3:45 PM IST

Updated : Sep 6, 2023, 3:51 PM IST

Rythu Bandhu Status
How to Check Rythu Bandhu Status 2023

How to Check Rythu Bandhu Status 2023 : తెలంగాణ సర్కార్ 11వ విడత 'రైతు బంధు' నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. మరి.. డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా..? లేదా..? చెక్ చేసుకున్నారా..? ఇలా ఆన్​లైన్​లో సింపుల్​గా చెక్​ చేసుకోండి.

How to Check Rythu Bandhu Payment Status in Telugu : రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శాలపల్లి వద్ద ప్రారంభించారు. 'రైతు బంధు' పథకం(Rythu Bandhu Scheme) ద్వారా ఎకరానికి ఖరీఫ్​లో రూ. 5వేలు, రబీలో 5వేల రూపాయల చొప్పున.. సంవత్సరానికి 10వేల రూపాయలు రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తోంది. విత్తనాలు, పురుగులమందుల వంటి పెట్టుబడుల కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తూ.. అన్నదాతలను ఆదుకుంటోంది.

Rythu Bandhu Funds 2023 Details : ఈ క్రమంలో ఇటీవల 2023 సంవత్సరం ఖరీఫ్ సీజన్​కు సంబంధించి రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ మొత్తం 11విడతల్లో రైతు బంధు ద్వారా అన్నదాతలు రూ.72,910 కోట్ల ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కార్(Telangana Government) అందించింది. అయితే.. ఈ దఫా కొత్తగా ఐదు లక్షల మంది అన్నదాతలకు ఈ స్కీమ్​ను వర్తింపజేసింది. రాష్ట్రంలో సుమారు 70లక్షల మందికి వానాకాలం సీజన్​కుగానూ ఇటీవల విడుదల చేసిన రైతుబంధు డబ్బులు జమకానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నగదు అర్హులైన ఆయా రైతుల అకౌంట్​లలో దశల వారీగా డిపాజిట్ అవుతున్నాయి.

మొదటగా మీరు.. ఇటీవల విడుదల చేసిన రైతుబంధు జాబితాలో ఉన్నారో లేదో ఇలా తెలుసుకొని.. ఆపై మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్​ సింపుల్​గా ఆన్​లైన్​లో ఇలా తెలుసుకోండి.

  • మొదట మీరు Rythubandhu.telangana.gov.in అనే అధికారిక వెబ్ సైట్​లోకి వెళ్లాలి.
  • అనంతరం హోం పేజీలో ఉన్న 'Rythu Bandhu Scheme' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు కొత్తగా ఓపెన్ అయ్యే వెబ్​ పేజీలో 'Cheque Distribution Schedule Report' మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత వచ్చే పేజీలో మీ జిల్లా, మండలం ఎంపిక చేసుకోవాలి.
  • అనంతరం మీకు స్క్రీన్​పై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
  • ఆ లిస్ట్​లో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోవాలి.
  • అందులో మీ పేరు ఉంటే మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి.

How to Apply for Rythu Bandhu : 'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేయాలి..? డబ్బులు పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి?

రైతు బంధు స్టేటస్​ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇలా చెక్​ చేసుకోండి..

How to Check Rythu Bandhu Status through the Official Website in Telugu :

  • మొదట మీరు తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్​ rythubandhu.telangana.gov.in ను సందర్శించాలి.
  • అప్పుడు అక్కడ ఓపెన్ అయిన పేజీలో 'Rythu Bandhu Agriculture Investment Support Scheme' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు రైతుబంధు అందుకునే సంవత్సరాన్ని నమోదు చేసి.. పీపీబీ నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
  • ఆపై మీ జిల్లా, మండలాన్ని ఎంచుకోవాలి. అలాగే అక్కడ అడిగిన వివరాలు సబ్మిట్ చేయాలి.
  • కొంత సమయం తర్వాత చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు దాన్ని తనిఖీ చేసి సేవ్ చేసుకోవాలి. ఇలా మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్ చెక్​ చేసుకోవచ్చు.

How to Check Rythu Bandhu Status Use Mobile App :

రైతు బంధు స్టేటస్ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు..

  • వెబ్ సైట్ ద్వారా కాకుండా.. మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • మొదట మీరు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి రైతు బంధు అధికారిక వెబ్ పేజీకి వెళ్లాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో మెనూ బార్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు 'Download Mobile App' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అలా మీ ఫోన్​లో రైతుబంధు యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అవ్వాలి లేదా నమోదు చేయాలి.
  • ఇలా మొబైల్​లో రైతుబంధు స్టేటస్ తెలుసుకోవచ్చు.

Helpline for Rythu Bandhu Status :

రైతు బంధు స్టేటస్ కోసం హెల్ప్‌లైన్ నంబర్ :

  • ఏదైనా అదనపు సందేహం ఉంటే.. హెల్ప్ లైన్ నంబర్ (040 2338 3520) కు కాల్ చేయవచ్చు.
  • ఈమెయిల్ ఐడీకి omag-ts@nic.in మెయిల్ కూడా చేయవచ్చు.

Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

Harish Rao Tweet about Rythu Bandu : రూ.10 వేలు.. 10 విడతలు.. రూ.65వేల కోట్లు

ఖాతాలో పడినా చేతిలోకి రాని రైతుబంధు సొమ్ము ఆ చిక్కుముడి వీడేదెలా

Last Updated :Sep 6, 2023, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.