ETV Bharat / state

How to Apply Telangana Driver Empowerment Programme : ఈ పథకానికి అప్లై చేసుకోండి.. వాహన కొనుగోలుపై 50% సబ్సిడీ పొందండి.!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 4:10 PM IST

Driver Empowerment Programme
Driver Empowerment Programme

How to Apply Driver Empowerment Programme in Telangana : మీరు వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? సరిపడ డబ్బు లేదని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో మీరు 50% సబ్సిడీ పొందవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి? దానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

How to Apply TS Driver Empowerment Programme in Online : తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి, సాధికారత కల్పించే దిశగా 'డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్'(Driver Empowerment Programme) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కింద వాహనాల కొనుగోలు కోసం డ్రైవర్లు ఆర్థిక సహాయం అందుకుంటారు. ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన డ్రైవర్లకు సహాయం చేయడం, వారి నైపుణ్యతను పెంచడం ఈ స్కీమ్ ఉద్దేశం. ఈ పథకం ద్వారా వాహానాలు కొనుగోలు చేసి, సొంతంగా ఉపాధి పొందవచ్చును. అయితే ఇంతకీ డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్​కి అర్హతలు ఏంటి? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత మొత్తం సబ్సిడీ అందిస్తుంది? ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అర్హత ప్రమాణాలివే..

Driver Empowerment Scheme Eligibility Criteria :

  • దరఖాస్తుదారులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి
  • ఈ పథకాన్ని ఎంచుకునే దరఖాస్తుదారులు తప్పనిసరిగా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, మైనారిటీ కమ్యూనిటీ, వెనుకబడిన వర్గానికి చెందినవారై ఉండాలి.

Required Documents for Driver Empowerment Programme :

దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు :

  • ఆధార్ కార్డు
  • జనన ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • ఈమెయిల్ ఐడీ
  • మొబైల్ నంబర్ మొదలైనవి

How to Apply for Driver Empowerment Programme in Telangana :

డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందు మీరు తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ మానిటరీ సిస్టమ్(OBMMS) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అప్పుడు హోమ్‌పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత మీరు హోమ్ పేజీలో apply under the driver empowerment programme అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీరు తప్పనిసరిగా అవసరమైన సమాచారాన్ని పూరించాలి.
  • ఆ తర్వాత మీరు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరగా submit బటన్​పై నొక్కాలి.
  • ఇలా మీరు ఈ విధానాన్ని పూర్తి చేయడం ద్వారా డ్రైవర్ సాధికారత ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Apply for Telangana Chenetha Mitra Scheme: "చేనేత మిత్ర" పథకానికి​.. ఇలా అప్లై చేసుకోండి!

ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎంత మొత్తంలో సబ్సిడీ అందించనుందంటే..

How much Subsidy get Driver Empowerment Programme : ఆటో రిక్షాలను కొనుగోలు చేసేటప్పుడు డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం డ్రైవర్ సాధికారత కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం(Telangana Government) లబ్ధిదారునికి రూ. 1.5 లక్షలు లేదా ఖర్చులో 50% సబ్సిడీని అందిస్తుంది. ఈ అవకాశం రాష్ట్ర వాసులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అంతే కాకుండా పౌరులు స్వయం సమృద్ధి పొందుతారు. అలాగే ఈ స్కీమ్ గ్రహీతల జీవన స్థాయిని కూడా పెంచుతుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన వర్గాల పౌరులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు.

Driver Empowerment Programme Benefits and Features :

డ్రైవర్ సాధికారత ప్రోగ్రామ్ ప్రయోజనాలు, ఫీచర్లు ఇవే..

  • ఈ పథకం ఫలితంగా రాష్ట్ర డ్రైవర్లు నగదు సహాయం అందుకుంటారు.
  • వారు వాహనం కొనుగోలు చేయడానికి ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, మైనారిటీ కమ్యూనిటీ, వెనుకబడిన వర్గానికి చెందిన వారికి మాత్రమే ఈ సహాయం అందుతుంది.
  • తెలంగాణ ప్రభుత్వం ఈ ప్లాన్ కింద ఆటో-రిక్షా కొనుగోలుపై రూ. 1.5 లక్షలు లేదా 50% తగ్గింపును మంజూరు చేస్తుంది.
  • ఈ పథకం అమలు ద్వారా డ్రైవర్లు స్వయం సమృద్ధి పొందుతారు. పేద ప్రజలకు ఉపాధి లభిస్తుంది.

Vishwakarma Scheme 2023 : 'విశ్వకర్మ' స్కీమ్​.. వారికి రూ.2లక్షల లోన్​.. రోజుకు రూ.500తో శిక్షణ.. అర్హులెవరంటే?

కార్లకు స్టార్ రేటింగ్​.. సేఫ్టీ చెకింగ్ కోసం భారత్ ఎన్​క్యాప్​.. ఎప్పటి నుంచో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.