ETV Bharat / state

ఆ కోటాపై స్పష్టత ఇచ్చిన ఉన్నత విద్యామండలి

author img

By

Published : Sep 8, 2021, 12:15 PM IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా సీట్లు పెరిగే విధానంపై స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు కళాశాలల్లోని మొత్తం సీట్లపై 10 శాతం పెంచి.. వాటిని కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తామని గతంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్గాలు చెప్పగా..తాజాగా ఆ విధానం మారింది.

Higher education resolution on EWS quota
ఈడబ్ల్యూఎస్‌ కోటాపై ఉన్నత విద్యామండలి స్పష్టత

మొత్తం సీట్లపై కాకుండా కేవలం కళాశాలలోని కన్వీనర్‌ కోటా సీట్లకు 10 శాతం పెంచి.. వాటిని కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తాం’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి స్పష్టంచేశారు. ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో 100 సీట్లుంటే.. అందులో కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీ చేసేవి 70 శాతం... అంటే 70 సీట్లు. దానిపై 10 శాతం లెక్కన 7 సీట్లు పెరుగుతాయని ఆయన తెలిపారు.ఇంజినీరింగ్‌లో 7 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా ద్వారానే భర్తీ చేస్తారు కాబట్టి ఆ మొత్తం సీట్లపై 10 శాతం సీట్లు పెంచుతామన్నారు. గత విద్యా సంవత్సరం(2020-21) సీట్ల ప్రకారం 7,116 సీట్లు పెరుగనున్నాయని చెప్పారు. . ఈ విద్యా సంవత్సరం సీట్లు ఎన్ని అనేది ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని లింబాద్రి చెప్పారు.

ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈసారి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు ఈడబ్ల్యూఎస్‌ కింద దరఖాస్తు చేసుకుని ర్యాంకు సాధించినవారు 16,777 మంది ఉన్నారు. వారిలో ఎందరు కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారన్నది ఈ నెల 11వ తేదీకి స్పష్టత రానుంది. ధ్రువపత్రాల పరిశీలన అదే తేదీ వరకు జరగనుంది.

అన్ని కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ వర్తింపజేస్తామని లింబాద్రి తెలిపారు. సీపీగెట్‌ ద్వారా భర్తీ చేసే ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ సీట్లలోనూ ఈ కోటా ఉంటుందన్నారు. జీఓ రాకముందే ఈసెట్‌ నోటిఫికేషన్‌ వచ్చినందున రెండో విడత కౌన్సెలింగ్‌లో వర్తింపచేయవచ్చా? లేదా? అన్నదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి:

Open Air Prison: భూమి కేటాయించినా మొదలుకాని పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.