ETV Bharat / state

High Court Verdict on Reservation for Local Students in Medical Colleges : వైద్య కళాశాలల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌.. సమర్థించిన హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 6:04 PM IST

Updated : Sep 11, 2023, 10:30 PM IST

Medical Colleges Issue in Telangana
Medical Colleges Issue in Telangana

17:57 September 11

High Court Verdict on Reservation for Local Students in Medical Colleges : వైద్య కళాశాలల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌.. సమర్థించిన హైకోర్టు

High Court Verdict on Reservation for Local Students in Medical Colleges : రాష్ట్రావతరణ తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కాంపిటెంట్ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు నిబంధనలు సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పునర్విభజన చట్టంలోని షరతు రాష్ట్రావిర్భావానికి ముుందున్న కళాశాలలకే వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రపతి ఉత్తర్వులు, పునర్విభజన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా లేదని తేల్చి చెప్పింది. ఆలిండియా కోటాలోని 15 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రయత్నించవచ్చని హైకోర్టు పేర్కొంది.

Telangana Local Candidate in Medical Colleges Issue : రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థుల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రావిర్భావం తర్వాత ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలిన 85 శాతం సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయని.. ప్రభుత్వ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. తెలంగాణలో కాంపిటెంట్ కోటాలో రాష్ట్రావిర్భావానికి ముందున్న 20 కాలేజీల్లో.. 2,850 సీట్లుండగా.. ఆ తర్వాత ఏర్పడిన 34 కాలేజీల్లో 8,215 సీట్లు ఉన్నాయి.

తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన 34 కాలేజీల్లో కాంపిటెంట్ కోటాలోని 85 శాతం సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని.. జులై 3న ప్రభుత్వం ఉత్తర్వులు(Government Orders) జారీ చేసింది. జీవో 72ను సవాల్ చేస్తూ 63 మంది ఏపీ విద్యార్థులు వేసిన పిటిషన్లపై.. సుదీర్ఘ వాదనల తర్వాత సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

Medical Reservation Seats : ఇకపై వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే

High Court JUDGEMENT on Telangana Medical Colleges : మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనలను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పార్లమెంట్​కు మాత్రమే సవరణ అధికారం ఉందని.. శాసనసభలు చేయరాదన్న వాదనను తోసిపుచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల విద్యార్థులకు పదేళ్ల పాటు ప్రవేశాల్లో సమాన హక్కు ఉంటుందన్న వాదనపై వివరణ ఇస్తూ.. అది రాష్ట్రావిర్భావానికి ముందున్న సీట్లకే వర్తిస్తుందని తెలిపింది. నీట్ నోటిఫికేషన్(NEET Notification) తర్వాత జీవో ఇవ్వడం తగదన్న వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ప్రవేశాల కోసం కాళోజీ యూనివర్సిటీ ప్రకటన జారీ చేయకముందే నిబంధనలు సవరించారని పేర్కొంది.

వందశాతం సీట్లు రిజర్వ్ చేయడం తగదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందన్న ఏపీ విద్యార్థుల వాదనను కూడా.. హైకోర్టు తోసిపుచ్చింది. మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లనే తెలంగాణ విద్యార్థులకు దక్కేలా జీవో ఉందని.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆలిండియా కోటాలోని 15 శాతం సీట్లలో చేరవచ్చునని తెలిపింది. ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

High Court Judgment on Medical Seats : మెడికల్ సీట్ల రిజర్వేషన్లలో స్థానికతపై హైకోర్టు కీలక తీర్పు

Telangana Medical Colleges Increase : 'రాష్ట్రంలో పెరిగిన మెడికల్​ కళాశాలలు.. స్వరాష్ట్రంలోనే వైద్యవిద్యను పూర్తి చేయవచ్చు'

New Medical Colleges In Telangana : రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలు.. 10 వేలకు చేరువ కానున్న ఎంబీబీఎస్ సీట్లు

Last Updated :Sep 11, 2023, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.