ETV Bharat / state

ఆ 8 జాతీయ ఉత్తమ పంచాయతీలకు భారీగా నజరానా

author img

By

Published : Apr 9, 2023, 2:23 PM IST

Etv Bharat
Etv Bharat

Best Gram Panchayats in Telangana : జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 8 పంచాయితీలు ఉత్తమ పురస్కారాలుకు ఎంపిక అయ్యాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం బహుమతిగా భారీ నగదు అందజేయనుంది. ఒక్కో పంచాయతీకి ఎంత నగదు అందనుందంటే..

Best Gram Panchayats in Telangana : జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ గ్రామ పంచాయతీలకు అధిక మొత్తంలో నగదు పురస్కారం అందనుంది. ఆయా పంచాయతీలకు కేంద్రం రూ.7.15 కోట్లను బహుమతిగా ఇవ్వనుంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా పలు కేటగిరీల్లో పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి.

దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ కింద మొదటి ర్యాంకులో నిలిచిన నాలుగు పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున నగదు బహుమతి అందనుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని గౌతంపూర్‌ పంచాయతీ, జనగామ జిల్లా లింగాల ఘన్​పూర్‌ మండలంలోని నెల్లుట్ల పంచాయతీ, మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని కొంగట్‌పల్లి పంచాయతీ, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో ఐపూర్ పంచాయతీలు రూ.50 లక్షల చొప్పున నజరానా అందుకోనున్నాయి.

మొదటి స్థానంలో నిలిచిన పంచాయతీల వివరాలు..

క్రమ సంఖ్యపంచాయితీ/జిల్లా గెలుచుకున్న కేటగిరీ
1గౌతంపూర్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లాహెల్తీ పంచాయతీ
2నెల్లుట్ల/జనగామ జిల్లావాటర్ సఫిషియెంట్
3కొంగట్‌పల్లి/మహబూబ్‌నగర్‌ జిల్లా సోషియల్లీ సెక్యూర్డ్
4ఐపూర్/సూర్యాపేట జిల్లాఉమెన్ ఫ్రెండ్లీ

ఈ పురస్కార్​​లో రెండో స్థానం దక్కించుకున్న రెండు పంచాయతీలకు రూ.40 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఫలితంగా ఈ కేటగిరీలో రెండోస్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో మందొడ్డి పంచాయతీ, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలో చీమల్‌దారి పంచాయతీలు రూ.40 లక్షల చొప్పున నగదు అందుకోనున్నాయి.

క్రమ సంఖ్యపంచాయితీ/జిల్లా గెలుచుకున్న కేటగిరీ
1మందొడ్డి /జోగులాంబ గద్వాల జిల్లా పావర్టీ ఫ్రీ విభాగం
2చీమల్‌దారి/ వికారాబాద్‌ జిల్లాగుడ్ గవర్నెన్స్ విభాగం

ఈ అవార్డులో మూడో ర్యాంక్​ గెలుచుకున్న పంచాయితీలకు రూ.30 లక్షలు అందనుంది. వాటి వివరాలు పూర్తిగా.. పెద్దపల్లి జిల్లా మండలం ఎలిగేడులో సుల్తాన్‌పూర్‌ పంచాయితీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట పంచాయితీలు దక్కించుకున్నాయి.

ఈ రెండు పంచాయితీలు గెలుచుకున్న కేటగిరీలు కింది విధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్యపంచాయితీ/జిల్లా గెలుచుకున్న కేటగిరీ
1సుల్తాన్ పూర్/పెద్దపల్లి జిల్లాక్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ
2గంభీరావుపేట/రాజన్న సిరిసిల్ల జిల్లాసెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫ్రా
  • నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ - 2023కింద రెండోర్యాంక్‌ సాధించిన కరీంనగర్​ జిల్లాకు చెందిన తిమ్మాపూర్‌ పంచాయితీకి రూ. 75 లక్షలు అందజేయనున్నారు.
  • ఉత్తమ జిల్లా పరిషత్‌ విభాగంలో రెండో ర్యాంకు పొందిన ములుగు జిల్లాకు రూ.3 కోట్ల నగదు బహుమానంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పురస్కారాలు పొందిన మిగిలిన పంచాయతీలకు ధ్రువీకరణపత్రాలను ఇస్తారు. ఈనెల 17న దేశ రాజధానిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు, నగదు బహుమతిని ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.