ETV Bharat / state

హెరిటేజ్​ ఫెస్ట్​లో ఆకట్టుకున్న విద్యార్థులు

author img

By

Published : Jan 3, 2020, 8:57 AM IST

హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో హరేకృష్ణ మూమెంట్​ వారు సంస్కృతి, సంప్రదాయాలను రాబోవు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో హెరిటేజ్​ ఫెస్ట్​ పోటీలను నిర్వహించారు. దాదాపుగా 300 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

heritage fest program in Hyderabad
హెరిటేజ్​ ఫెస్ట్​లో ఆకట్టుకున్న విద్యార్థులు

సంస్కృతి, సంప్రదాయాల (సుమేదసా - హెరిటేజ్ ఫెస్ట్) పోటీలను హరే కృష్ణ మువ్​మెంట్ హైదరాబాద్​లో నిర్వహించింది. జంట నగరాలతో పాటు మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి 22,971 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గెలుపొందిన విద్యార్థులకు రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానం చేశారు. రేపటి తరాన్ని అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి హెరిటేజ్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హరే కృష్ణ మువ్​మెంట్ నిర్వాహకుడు సత్యగౌర చంద్ర దాస స్వామిజీ తెలిపారు.

భారతీయ సంప్రదాయాల పోటీల్లో భాగమైన జ్ఞానోదయం, సృజనాత్మకత, వినోదం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాలు, తెలివితేటలను వైదిక పద్ధతిలో ప్రదర్శిస్తూ ఆటపాటలతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు.

హెరిటేజ్​ ఫెస్ట్​లో ఆకట్టుకున్న విద్యార్థులు

ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్​తో రైతు మృతి

TG_Hyd_57_02_Hare Krishna Movement_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) సాంస్కృతి , సంప్రదాయాల ( సుమేదసా - హెరిటేజ్ ఫెస్ట్ ) పోటీలను హరే కృష్ణ మూవ్మెంట్ హైద్రాబాద్ లో నిర్వహించింది. జంట నగరాలతో పాటు మెదక్ , సంగారెడ్డి , రంగారెడ్డి , వికారాబాద్ జిల్లాల నుండి... 300 పాఠశాలల నుండి 22,971 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనల్ లో గెలుపొందిన విద్యార్థులకు రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రేపటి తరాన్ని అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి హెరిటేజ్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హరే కృష్ణ మోవ్మెంట్ నిర్వాహకులు తెలిపారు. సుమేదసా పోటీల ముఖ్య ఉద్దేశం భారతీయ సంప్రదాయాల పోటీలలో భాగమైన జ్ఞానోదయం, సృజనాత్మకత మరియు వినోదం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాలను , తెలివి తేటలను వైదిక పద్దతిలో చూపించడంతో పాటు... ఆటపాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.