ETV Bharat / state

LIVE UPDATES : హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవు పొడిగింపు

author img

By

Published : Jul 20, 2023, 8:49 AM IST

Updated : Jul 20, 2023, 10:34 PM IST

telangana rains
telangana rains

22:33 July 20

హుస్సేన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు

  • హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • హుస్సేన్‌సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు

22:07 July 20

హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్ ఫ్లో

  • హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్ ఫ్లో
  • ఉస్మాన్ సాగర్ జలాశయానికి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
  • ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1784.20 అడుగులు
  • హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1760.25 అడుగులు

21:21 July 20

భారీ వర్షాల వల్ల జీహెచ్‌ఎంసీలో పలు కాలనీలు జలమయం

  • లింగోజిగూడ డివిజన్‌లోని అల్తాఫ్‌నగర్‌ కాలనీ జలదిగ్బంధం
  • అల్తాఫ్‌నగర్‌ కాలనీలోని దాదాపు 30 ఇళ్లల్లోకి చేరిన వరదనీరు
  • బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం డివిజన్‌లో వరద ప్రభావం
  • మూడు డివిజన్ల పరిధిలో దాదాపు 100 కాలనీలు జలమయం
  • వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు
  • కాలనీల్లో వరద నివారణ చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు

20:13 July 20

జీహెచ్‌ఎంసీలోని విద్యా సంస్థలకు మరో 2 రోజులు సెలవు

  • జీహెచ్‌ఎంసీలోని విద్యా సంస్థలకు మరో 2 రోజులు సెలవు
  • జీహెచ్‌ఎంసీలో రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • సెలవులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖకు సీఎం ఆదేశం
  • వైద్యం, పాల సరఫరా, అత్యవసర సేవలు కొనసాగుతాయన్న సీఎం

20:04 July 20

వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో అద్భుత దృశ్యం

  • వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో అద్భుత దృశ్యం
  • అనంతగిరి కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం
  • ఐదేళ్ల తర్వాత అనంతగిరి కొండలపై ఆవిష్కృతమైన జలపాతం

19:05 July 20

నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన, కూలిన ఇళ్లు

  • నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన, కూలిన ఇళ్లు
  • ఎడతెరిపిలేని వర్షం వల్ల డిచ్‌పల్లి మండలంలో కూలిన 5 ఇళ్లు
  • నిజామాబాద్‌: వర్షాల వల్ల మెట్రారాజ్‌పల్లిలో కూలిన 3 ఇళ్లు
  • లింగసముద్రం, యానంపల్లి తండాలో ఒక్కో ఇల్లు ధ్వంసం
  • ధర్పల్లి మండలం హోన్నాజీపేట్‌లో కూలిన మరో ఇల్లు
  • ఇల్లు పడిపోవటం గమనించి బయటికి పరుగెత్తిన కుటుంబీకులు

18:35 July 20

  • వికారాబాద్: మోమిన్‌పేట మండలంలో ఎడతెరిపిలేని వర్షం
  • గిర్గెట్‌పల్లి వెళ్లే దారిలో రైల్వేబ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు
  • రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలవడంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • కేసారం గ్రామంలో వర్షం వల్ల దెబ్బతిన్న మైబెల్లి శివయ్య ఇల్లు
  • వికారాబాద్: నవాబుపేట మం. పులిమామిడిలో కూలిన శివరాజమ్మ ఇల్లు
  • కూలిన ఇంటిని పరిశీలించిన డీఎల్‌పీ అనిత, మండల అధికారులు

18:35 July 20

  • నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • నల్గొండ: మూసీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీరు విడుదల

18:34 July 20

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ప్రియాంక

  • భద్రాద్రి: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ప్రియాంక
  • గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుంది: కలెక్టర్‌ ప్రియాంక
  • లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి: కలెక్టర్

18:33 July 20

  • వర్షాల దృష్ట్యా జలమండలి ఎండీ దానకిషోర్‌ సమీక్ష
  • హైదరాబాద్‌: సమీక్షలో పాల్గొన్న జలమండలి ఉన్నతాధికారులు
  • వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: దానకిషోర్‌
  • అత్యవసర ప్రతిస్పందన దళాలు అప్రమత్తంగా ఉండాలి: దానకిషోర్‌
  • వర్షాల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి: దానకిషోర్‌
  • మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్‌ ఉండేలా చర్యలు: దానకిషోర్‌

18:30 July 20

  • వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
  • వికారాబాద్‌: తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు
  • వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు మార్గాల్లో రవాణాకు అంతరాయం
  • వర్షాల దృష్ట్యా తాండూరు మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

17:46 July 20

హైదరాబాద్‌లోని చార్మినార్ యునాని ఆస్పత్రిలో పైకప్పు నుంచి నీరు

  • హైదరాబాద్‌లోని చార్మినార్ యునాని ఆస్పత్రిలో పైకప్పు నుంచి నీరు
  • యునాని ఆస్పత్రిలో ప్రసూతి వార్డులోకి చేరిన వర్షపునీరు
  • రోగులను మరో వార్డులోకి మారుస్తున్న ఆస్పత్రి సిబ్బంది

17:22 July 20

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన

  • హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
  • హైదరాబాద్‌లోని పలుచోట్ల రహదారులపై నిలిచిన వర్షపు నీరు
  • రోడ్లపై వరదనీరు వల్ల నెమ్మదిగా సాగుతున్న వాహనాలు
  • హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లు, కూడళ్లలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌
  • మాదాపూర్, గచ్చిబౌలిలో రోడ్లు జలమయం, ట్రాఫిక్‌ జామ్‌
  • రాయదుర్గం, కొండాపూర్‌లో భారీగా స్తంభించిన వాహనాలు
  • పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌పై వాహనదారుల ఆగ్రహం
  • కొన్నిచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
  • మ్యాన్‌హోల్స్ మూసుకుపోయి రోడ్లపై నిలిచిన వరద నీరు
  • జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం
  • నీటమునిగిన లింగంపల్లి రైల్వే అండర్ పాస్, కాలనీలు జలమయం
  • ఖైరతాబాద్ రైల్వే గేట్ వద్ద దుకాణాల్లోకి చేరిన వరద నీరు

16:39 July 20

వర్షాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉంది: ట్రాన్స్ కో సీఎండీ

  • వర్షాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉంది: ట్రాన్స్ కో సీఎండీ
  • ఇప్పటివరకు 345 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి: రఘుమారెడ్డి
  • ఇంతవర్షం ఉన్నప్పటికీ ఎక్కడా కరెంట్ పోవడం లేదు: రఘుమారెడ్డి
  • ఎప్పటికప్పుడు మా ఉద్యోగులు, ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు: రఘుమారెడ్డి
  • ఇంజినీర్లుకు సెలవులు రద్దు చేశాం: ఎస్పీడీసీఎల్‌ సీఎండీ
  • ఎక్కడైనా నష్టం వాటిల్లితే అధికారులకు చెప్పాలి: ఎస్పీడీసీఎల్‌ సీఎండీ
  • విద్యుత్‌ సంస్థ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలి: సీఎండీ
  • హెల్ప్‌లైన్‌ నంబర్లు: 1912,100, 7382071574, 7382072106, 7382072104
  • అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలో మీటర్లు ఏర్పాటు ప్రమాదకరం: రఘుమారెడ్డి

15:57 July 20

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష

  • రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష
  • రానున్న 48 గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం: సీఎస్‌
  • అన్ని శాఖల అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌
  • అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం: సీఎస్‌
  • వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం: సీఎస్‌
  • హైదరాబాద్‌లోనూ 40 మంది సిబ్బందితో బృందం సిద్ధం: సీఎస్‌
  • గ్రేటర్‌లో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధం: సీఎస్‌
  • నగరంలో 157 స్టాటిక్ టీమ్‌లను సిద్ధంగా ఉంచాం: సీఎస్‌ శాంతికుమారి
  • నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బంది సిద్ధం: సీఎస్‌
  • ఇప్పటివరకు చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లలేదు: సీఎస్‌
  • ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 50 శాతం మాత్రమే ఉన్నాయి: సీఎస్‌
  • సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి: సీఎస్‌
  • అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలి: సీఎస్‌ శాంతికుమారి

15:38 July 20

గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

  • భద్రాచలం వద్ద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులు చేరిన గోదావరి నీటి మట్టం.
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా
  • గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
  • ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశం
  • ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలన్న కలెక్టర్‌

14:42 July 20

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలంలో 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో భద్రాచలం వద్ధ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు
  • లోతట్టు కాలనీలు గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ ప్రియాంక ఆలా

14:26 July 20

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం

  • హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం
  • బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం
  • బేగంపేట్, మారేడుపల్లి, చిలకలగూడలో వర్షం

13:35 July 20

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం ఒంటి గంటకు 42అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

13:35 July 20

హైదరాబాద్‌లో వర్షాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష

  • హైదరాబాద్‌లో వర్షాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష
  • సమీక్షకు హాజరైన జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు
  • వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశం
  • సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జీహెచ్‌ఎంసీ

13:35 July 20

గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
  • జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • టోల్ ఫ్రీ నంబర్ 040-21111111, డీఆర్‌ఎఫ్‌ టోల్ ఫ్రీ నంబర్ 9000113667

12:40 July 20

గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
  • జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • టోల్ ఫ్రీ నంబర్ 040-21111111, డీఆర్‌ఎఫ్‌ టోల్ ఫ్రీ నంబర్ 9000113667

12:39 July 20

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు రామాలయం ఏరియా దుకాణదారుల ధర్నా

  • భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
  • సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు రామాలయం ఏరియా దుకాణదారుల ధర్నా
  • అధికారుల నిర్లక్ష్యం వల్లే దుకాణాలు వర్షపు నీటిలో మునిగిపోయాయని ఆవేదన

12:37 July 20

భారీ వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ అత్యవసర సమావేశం

  • భారీ వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ అత్యవసర సమావేశం
  • ఉన్నతస్థాయి కార్యదర్శులు, అధికారులతో సీఎస్‌ శాంతికుమారి సమావేశం

11:52 July 20

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం

  • వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం

11:50 July 20

అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన

  • రాష్ట్రంలో వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
  • అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలి: హరీశ్‌
  • మధ్నాహ్నం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
  • ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష

11:50 July 20

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

  • భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
  • సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఎస్‌
  • నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష
  • రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీసు, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష

11:07 July 20

రాష్ట్రంలో ఇవాళ, రేపు అన్ని వర్సిటీ పరీక్షలు వాయిదా

  • రాష్ట్రంలో ఇవాళ, రేపు అన్ని వర్సిటీల్లో జరగవలసిన పరీక్షలు వాయిదా

10:38 July 20

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • ఉ.10 గంటలకు 40.8అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

10:25 July 20

కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

  • భూపాలపల్లి: కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
  • మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న ప్రాణహిత ప్రవాహం
  • పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు
  • కాళేశ్వరం వద్ద 33 అడుగులకు చేరిన నీటిమట్టం

10:23 July 20

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ప్రవాహం

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 47,332 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1073.2 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091అడుగులు
  • కామారెడ్డి: పోచారం ప్రాజెక్టుకు 9,091 క్యూసెక్కుల ప్రవాహం
  • పోచారం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,459అడుగులు
  • పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,464అడుగులు
  • కామారెడ్డి: కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 775 క్యూసెక్కుల ప్రవాహం
  • కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 456మీటర్లు
  • కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458మీటర్లు

10:23 July 20

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
  • మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షాలు
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలమయమైన రహదారులు
  • లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద భారీగా చేరుకున్న వర్షపు నీరు

10:05 July 20

కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

  • కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • జలమయమైన లోతట్టు ప్రాంతాలు, పొంగిపొర్లుతున్న వాగులు
  • రోడ్లపై నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
  • కామారెడ్డి- బ్రహ్మణపల్లి మధ్య తెగిపోయిన తాత్కాలిక రోడ్డు
  • కామారెడ్డి నుంచి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • కామారెడ్డి: కర్ణంగడ్డ తండాకు వెళ్లే మార్గంలో కోతకు గురైన రహదారి
  • నిజామాబాద్: లింగపూర్ వాగు ఉద్ధృతికి ధ్వంసమైన రహదారి
  • అలుగు పారుతున్న డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ చెరువు

10:04 July 20

కామారెడ్డిలో వర్షాలకు నాని కూలిన పైకప్పు

  • కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఊడి పడిన పీవోపీ పెచ్చులు
  • కామారెడ్డి: డయాగ్నొస్టిక్ గదిలో కూలిన పీవోపీ పెచ్చులు
  • కామారెడ్డి: ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • కామారెడ్డి: వర్షాలకు నాని కూలిన పైకప్పు

10:03 July 20

రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

  • ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
  • వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

09:27 July 20

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • ఉ.9 గంటలకు 40 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

09:26 July 20

భూపాలపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • భూపాలపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • కాకతీయ ఉపరితల గనుల్లో వర్షపు నీరు చేరి నిలిచిన బొగ్గు ఉత్పత్తి

09:25 July 20

భద్రాచలం పడమర మెట్ల వద్ద బొమ్మల దుకాణాల్లోకి చేరిన వర్షపు నీరు

  • భద్రాచలం: రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం వద్దకు చేరిన వర్షపు నీరు
  • పడమర మెట్ల వద్ద బొమ్మల దుకాణాల్లోకి చేరిన వర్షపు నీరు

09:25 July 20

కేశవాపూర్- పెగడపల్లి మధ్య పొంగి ప్రవహిస్తున్న వాగు

  • భూపాలపల్లి: కేశవాపూర్- పెగడపల్లి మధ్య పొంగి ప్రవహిస్తున్న వాగు
  • వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిపివేత

09:08 July 20

బస్వాపూర్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు

  • సిద్దిపేట: బస్వాపూర్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు
  • సిద్దిపేట: వాగు ఉద్ధృతికి నిలిచిన వాహనాల రాకపోకలు

09:06 July 20

ఇల్లందు నియోజకవర్గంలో వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

  • ఇల్లందు నియోజకవర్గంలో వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

09:06 July 20

తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు చేరుతున్న వరద

  • భద్రాద్రి: తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు చేరుతున్న వరద
  • ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 51 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

09:05 July 20

వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

  • వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • వికారాబాద్: వర్షాల కారణంగా పంటపొలాల్లో భారీగా చేరిన వరద

09:05 July 20

బచ్చన్నపేట మండలంలో తెగిన కల్వర్టు

  • జనగామ: బచ్చన్నపేట మండలంలో తెగిన కల్వర్టు
  • రహదారి మరమ్మత్తు పనుల్లో భాగంగా తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు
  • జనగామ- సిద్దిపేట వెళ్లే వాహనాలకు అంతరాయం

09:03 July 20

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న ఉభయ నదుల ప్రవాహం

  • భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద పెరుగుతున్న ఉభయ నదుల ప్రవాహం
  • భూపాలపల్లి: 33 అడుగులు మేర నీటిమట్టం నమోదు
  • ములుగు: పేరూరులో 42.21అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

09:03 July 20

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

  • భద్రాద్రి: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
  • ఉ.7 గంటలకు 39 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

09:02 July 20

కడెం జలాశయానికి పెరిగన వరద ఉద్ధృతి

  • నిర్మల్: కడెం జలాశయానికి పెరిగన వరద ఉద్ధృతి
  • కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 691.200 అడుగులు
  • కడెం జలాశయలో చేరుతున్న 3608 క్యూసెక్కుల వరద నీరు
  • కడెం జలాశయం ఒక వరద గేట్ ద్వారా 2142 క్యూసెక్కుల నీటి విడుదల

08:40 July 20

RAIN LIVE UPDATES : విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • వర్షం కారణంగా ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు
  • విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించిన మంత్రి సబిత
Last Updated :Jul 20, 2023, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.