ETV Bharat / state

సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల సాయం

author img

By

Published : Mar 7, 2022, 12:17 PM IST

Updated : Mar 7, 2022, 12:27 PM IST

Asembly live updates
Asembly live updates

09:18 March 07

సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఆర్థికసాయం

సొంత స్థలం ఉండి... ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు బడ్జెట్​లో మంత్రి హరీశ్ రావు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లోనే తెరాస ప్రభుత్వం... ఈ విషయంపై హామీ ఇచ్చింది.

సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. నియోజకవర్గానికి 3వేల ఇళ్లను కేటాయించనుంది. ఈ పథకంతో.. చాలా మంది సామాన్యులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు... డబుల్ బెడ్​రూం ఇళ్లను నిర్మిస్తుంది. రెండు పడక గదుల నిర్మాణంతో రాష్ట్రంలో చాలా మంది పేద ప్రజలు లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్​లో కేటాయించింది. ఇప్పుడు తాజాగా స్థలం ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది.

ఇదీ చూడండి:

Telangana Budget 2022-23 : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Last Updated : Mar 7, 2022, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.