ETV Bharat / state

దేశంలో వైద్య విద్య సంపన్న వర్గాలకే పరిమితమైంది: గవర్నర్​

author img

By

Published : Oct 24, 2020, 10:38 PM IST

వైద్య విద్యను అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్​ చర్యలు చేపడుతుందని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో వైద్య విద్య సంపన్న వర్గాలకే పరిమితమైందని గవర్నర్​ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్య సీట్లు పెరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

governor tamilisai soundararajan spoke on medical education in country
దేశంలో వైద్య విద్య సంపన్న వర్గాలకే పరిమితమైంది: గవర్నర్​

దేశంలో వైద్య విద్య ఖరీదైనదిగా మారిందని.. కేవలం సంపన్న వర్గాలకే పరిమితమైందని గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యకు భారీ వ్యయం ఉంటున్నందున పేదలు చేరలేకపోతున్నారని.. ఇది మంచి పరిణామం కాదన్నారు. జాతీయ వైద్య కమిషన్ ప్రాముఖ్యతపై అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.. ఆస్కిలోని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ నిర్వహించిన వెబినార్​లో గవర్నర్ మాట్లాడారు. వైద్య విద్య రంగంలో జాతీయ వైద్య కమిషన్ కొత్త శకాన్ని తీసుకువస్తుందని తమిళిసై సౌందరరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైద్య విద్యలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతికి అడ్డుకట్ట వేయడం ఎన్ఎంసీ ఉద్దేశమన్నారు. వైద్య విద్యను అందరికి అందుబాటులోకి తెచ్చేలా ఎన్ఎంసీ చర్యలు చేపడతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చువుతోందని.. అంత పెట్టబడి పెట్టిన యాజమాన్యాలు సేవ చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. వైద్య విద్యలో ప్రస్తుతం నెలకొన్న పోకడలు అంతమై.. అందరికీ అందుబాటులోకి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. వైద్య విద్య సీట్లు పెరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఆరేళ్లలో 48 శాతం సీట్లు పెరిగాయన్నారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా ఏటా లక్ష మంది వైద్య పట్టభద్రులను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ఇవీ చూడండి: రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.