ETV Bharat / state

DISHA CASE: దిశ ఎన్​కౌంటర్​ బాధిత కుటుంబాలకు ప్రత్యేక భద్రత

author img

By

Published : Aug 26, 2021, 5:19 PM IST

పోలీసులే తమను హతమార్చేందుకు యత్నించారనే ఆరోపణతో... 'దిశ' కేసులో అసలేం జరుగుతోందనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో సిర్పూర్కర్ కమిషన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం భద్రత కల్పించింది.

DISHA CASE: దిశ ఎన్​కౌంటర్​ బాధిత కుటుంబాలకు భద్రత కల్పించిన ప్రభుత్వం
DISHA CASE: దిశ ఎన్​కౌంటర్​ బాధిత కుటుంబాలకు భద్రత కల్పించిన ప్రభుత్వం

దిశ ఎన్​కౌంటర్ మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం భద్రత కల్పించింది. సిర్పూర్కర్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంది. ఎన్​కౌంటర్​పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. కమిషన్ ఎదుట హాజరు కావొద్దంటూ బెదిరింపులు వస్తున్నాయని మృతుల కుటుంబ సభ్యులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే చెన్నకేశవులు తండ్రిని రహదారి ప్రమాదంలో మృతి చెందాడని.. ఆ ప్రమాదంపైనా అనుమానాలున్నాయని కమిషన్​కు తెలిపారు. విచారణకు హాజరు కాకుండా...కేసును ఉపసంహరించుకుంటే 25లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తున్నారనే విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది... కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో విచారణ ముగిసే వరకు భద్రత కల్పించాలని కమిషన్​ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వచ్చిన మృతుల కుటుంబ సభ్యులకు భద్రతగా ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. మక్తల్​ నియోజకవర్గంలోని గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లోని బాధితుల ఇళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేశారు.

రూ.25లక్షలు ఇస్తామని బాధితులను బెదిరించారు. వారు డబ్బులకు లొంగకపోయేసరికి ప్రాణభయం కలిగించాలని యత్నించారు. అలా కూడా ఎన్నో వీళ్లకు ఎన్నోసార్లు ఇబ్బంది కలిగించారు. దానిని అఫిడవిట్​లో దాఖలు చేసి కమిషన్​ ముందు వ్యక్తపరిచారు. కమిషన్​ దానిని నమ్ముతూ రక్షణ కల్పించడం జరిగింది. మక్తల్​ మండలంలో బాధిత కుటుంబాలందరికీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ కేసు వాదిస్తున్న న్యాయవాదులకు కూడా రక్షణ కల్పించారు. -రజని, బాధితుల తరఫు న్యాయవాది

దిశ ఎన్​కౌంటర్​ బాధిత కుటుంబాలకు భద్రత కల్పించిన ప్రభుత్వం

ఇదీ చదవండి: Disha case: దిశ ఎన్‌కౌంటర్‌ బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించండి: త్రిసభ్య కమిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.