ETV Bharat / state

శంషాబాద్​లో 725 గ్రాముల బంగారం స్వాధీనం

author img

By

Published : Oct 20, 2019, 6:14 PM IST

అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ ప్రయాణికుణ్ని శంషాబాద్​ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి సుమారు రూ.27.87లక్షలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

GOLD RECOVERY IN SHAMSHABAD AIRPORT BY DRI OFFICERS

శంషాబాద్ విమానాశ్రయంలో 725 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం రాగా... అధికారులు తనిఖీలు చేశారు. ప్రయాణికుడి వద్ద నల్లటి టేపు చుట్టిన కోడిగుడ్డు ఆకారంలోని మూడు ఉండలు దొరికాయి. మొత్తం 832 గ్రాములు బరువున్న బంగారం ముద్దలను స్వాధీనం చేసుకుని వాటిని కరిగించారు. అందులో ఉంచి వృథా అంతా పోనూ... రూ.27.87లక్షలు విలువైన 725 గ్రాములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు విచారణ చేపట్టారు.

శంషాబాద్​లో 725 గ్రాముల బంగారం స్వాధీనం

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

TG_Hyd_26_20_GOLD_RECOVERY_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: వీడియో....డెస్క్‌ వాట్సప్‌కు పంపాను. వాడుకోగలరు. ()శంషాబాద్ విమానాశ్రయంలో 725 గ్రాముల బంగారాన్నిడీఆర్‌ఐ అధికారులు డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణీకుడిని అనుమానించి తనిఖీలు చేశారు. అతని నుంచి నల్లటి టేపు చుట్టిన కోడిగుడ్డు ఆకారంలోని మూడు ఉండలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 832 గ్రాములు బరువున్న బంగారం ముద్దలను స్వాధీనం చేసుకుని వాటిని కరిగించారు. అందులో ఉంచి వృధా అంతా పోను...రూ.27.87లక్షలు విలువైన 725 గ్రాములు ఉన్నట్లు అంచనా వేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.