ETV Bharat / state

సహాయం ముమ్మరం.. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు

author img

By

Published : Oct 19, 2020, 9:04 PM IST

భారీ వర్షాలు.. వరదల కారణంగా హైదరాబాద్​ మొత్తం అతలాకుతలమైంది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ముమ్మర చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకుపోయిన 2500 మందిని కాపాడినట్టు జీహెచ్​ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం డైరెక్టర్ విశ్వజిత్​ పేర్కొన్నారు. బయటకు రాలేకపోయిన  ప్రజలకు ఆహారం. తాగునీరు అందించినట్టు తెలిపారు.

GHMC Speedup Rescue Operation In Hyderabad
ముమ్మరంగా సహాయక చర్యలు.. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. వరదల్లో చిక్కుకుపోయిన 2540 మందిని సురక్షింతగా కాపాడినట్టు జీహెచ్​ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం డైరెక్టర్​ విశ్వజిత్ తెలిపారు. అపార్ట్​మెంట్​ సెల్లార్లలో నిండిపోయిన నీటిని తోడేందుకు 72 డీ వాటరింగ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. నగరంలో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6 బోట్లతో క్షేత్ర స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 202 సెల్లార్లలో నీటిని తోడి.. విద్యుత్​ పునరుద్ధరించినట్టు తెలిపారు.

ఆస్పత్రులు, సబ్​స్టేషన్లలో నీటిని తోడేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని.. దీనికోసం 105 డీవాటరింగ్ పంపులు పనిచేస్తున్నాయని చెప్పారు. అవసరం అయిన చోట రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు మెషిన్లను ఉపయోగిస్తున్నామన్నారు. నగరంలో 390 చోట్ల నేలకూలిన చెట్లను 19 డీఆర్​ఎఫ్​ బృందాలు పనిచేసి వెంటనే తొలగించాయని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన 645 ఫిర్యాదులు పరిష్కరించామని.. వరదల తర్వాత అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రైతుకు సాయం.. యువతకు ఆదాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.