ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వం చెప్పినా... ఎవరూ పాటించడం లేదు'

author img

By

Published : Feb 25, 2020, 10:24 AM IST

ప్రతి మందుల దుకాణంలో జనరిక్ ఔషధాలను విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించినా... ఏ ఒక్కరూ నిబంధనలు పాటించడంలేదని హెచ్​ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది.

generic medicine case file in Human Rights Commission at hyderabad
'కేంద్ర ప్రభుత్వం చెప్పినా... ఎవరూ పాటించడంలేదు'

సాధారణ మందుల దుకాణాల్లోనూ జనరిక్ ఔషధాలను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్​కు చెందిన మార్త సత్యనారాయణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో వ్యాజ్యం దాఖలు చేశారు.

కేసును స్వీకరించిన కమిషన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను విచారణ చేసింది. ఈ అంశంపై మార్చి 30లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. జెనరిక్ మందులను సాధారణ మందుల దుకాణాల్లో విక్రయించకపోవడం వల్ల.. సామాన్యులు అధిక ధరలకు కార్పొరేట్ మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని సత్యనారాయణ ఆరోపించారు.

ఇవీచూడండి: డీసీసీబీ, డీసీఎంఎస్​ ఎన్నికలకు నేడు నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.