ETV Bharat / state

Ganesh Nimajjanam Hyderabad 2023 : 25వేల మంది పోలీసుల భద్రత.. ట్రాఫిక్ ఆంక్షల మధ్య.. రేపే 'మహా' నిమజ్జనం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 10:37 AM IST

Updated : Sep 27, 2023, 11:22 AM IST

Arrangements for Vinayaka immersion at Hussainsagar
Arrangements for Vinayaka immersion in Telangana

Ganesh Nimajjanam Hyderabad 2023 : హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏటా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించే భాగ్యనగరవాసులు.. గతేడాదికి మించి ఈ సారి రికార్డు స్థాయిలో ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ సమితి సమావేశం నిర్వహించింది.

Ganesh Nimajjanam Hyderabad 2023 25వేల మంది పోలీసుల భద్రత.. ట్రాఫిక్ ఆంక్షల మధ్య.. రేపే మహా నిమజ్జనం

Ganesh Nimajjanam Hyderabad 2023 : హైదరాబాద్​లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాన్ని ఏ శక్తి ఆపలేదని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. ఎవరైనా అడ్డుకునేందుకు యత్నిస్తే ట్యాంక్‌బండ్‌ వద్ద ధర్నా చేపడుతామని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు హెచ్చరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి(Bhagyanagar Ganesh Utsav Committee) అసెంబ్లీ, డివిజన్ కన్వీనర్లు, గణేశ్‌ మండప నిర్వాహకులు, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, రాచకొండ సీపీ చౌహన్‌, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిమజ్జనం రోజు చేపట్టాల్సిన పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా శాఖల దృష్టికి తీసుకెళ్లారు.

"ఎలాంటి ఏర్పాట్లు చేసినా.. చేయకపోయిన ప్రపంచంలో వినాయక నిమజ్జనాన్ని ఎవరు అడ్డుకోలేరు. బేగం బజార్​లో వినాయక విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. భద్రాతా ఏర్పాట్లుపై లోకల్​ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే.. ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇది నిర్లక్ష్యమా? అలసత్వమా? అని జీహెచ్​ఎంసీ కమిషనర్​ని అడుగుతున్నా." - భగవంతరావు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రధాన కార్యదర్శి

నిమజ్జనంపై గందరగోళం వద్దు.. ట్యాంక్​బండ్​పై ఏర్పాట్లు జరుగుతున్నాయన్న తలసాని

Ganesh Nimajjanam Arranagments Hyderabad 2023 : గణేశ్‌ నిమజ్జనం(Ganesh immersion) కోసం హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసేందుకు విగ్రహాలను ప్రతిష్టించడానికి ముందే నిర్వాహకులతో ఇంటిమేషన్‌ ఫామ్‌ తీసుకున్నట్లు రాచకొండ సీపీ చౌహాన్‌ తెలిపారు.

వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లు ఇవే..

  • బందోబస్తు కోసం జిల్లాల నుంచి భారీగా పోలీసులను నగరానికి రప్పించారు.
  • రాచకొండ పరిధిలోని 56 చెరువుల వద్ద నిమజ్జనం ఏర్పాట్లతో పాటు 228 పికెట్‌ ఏరియాలు ఏర్పాటు చేశారు
  • ఎక్కడికక్కడ బందోబస్తుతో పాటు పెద్ద విగ్రహాలకు ఒక కానిస్టేబుల్‌, హోంగార్డులతో భద్రత నిర్వహిస్తారు
  • నిమజ్జనం కోసం వచ్చే భక్తులకి మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు
  • వైద్య బృందాల ఏర్పాటు
  • మహిళా భద్రత కోసం రెడీగా షీ టీమ్స్‌
  • మఫ్టీ పోలీస్‌లను మరింత భద్రత కోసం రంగంలోకి దించారు.

"నగరంలో గణేష్​ నిమజ్జనం జరిపేందుకు పోలీసు వ్యవస్థ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. భారీ స్థాయిలో బందోబస్తు పెట్టాం. రాచకొండ, సైబరాబాద్​, హైదరాబాద్​ సిబ్బంది కలిపి 2500 మంది పోలీసు వ్యవస్థతో సన్నద్ధం అవుతున్నాం."-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ


CV Anandh on Arrangements for Ganesh immersion : సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి ఐడీఎల్​ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని ప్రజలు సహకరించాలని సూచించారు. భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించుకోవాలని డీజేలు పెట్టడం తగ్గించుకోవాలని హైదరాబాద్‌ సీవీ ఆనంద్‌ కోరారు.

'నిమజ్జనానికి రెండ్రోజులే ఉంది.. ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు..?'

Kukatpally: కూకట్‌పల్లిలో మందకొడిగా నిమజ్జనం.. సాయంత్రం రద్దీ పెరిగే అవకాశం

Last Updated :Sep 27, 2023, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.