ETV Bharat / state

'నిమజ్జనానికి రెండ్రోజులే ఉంది.. ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు..?'

author img

By

Published : Sep 7, 2022, 6:54 PM IST

బండి సంజయ్‌
బండి సంజయ్‌

Bandi Sanjay On Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి రెండ్రోజులే గడువు ఉన్నా ప్రభుత్వం ఏర్పాట్లు చేయట్లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ ట్యాంక్​బండ్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం క్రేన్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ట్యాంక్‌బండ్​లోనే గణేష్ నిమజ్జనాలు చేద్దామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay On Ganesh Immersion:హైదరాబాద్​ ట్యాంక్‌బండ్​లోనే గణేష్ నిమజ్జనాలు చేద్దామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌లు ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. సచివాలయ సమీపంలోని ఎన్టీఆర్‌ గార్డెన్ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రుల అబద్దాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకూ తూతూ మంత్రంగానే ఏర్పాట్లు జరుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.

"ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. సర్కారు చర్యలు తీసుకోకపోతే పోరు తప్పదు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆందోళనల చేసినందుకే క్రేన్లు ఏర్పాటు చేశారు. మంత్రుల అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కచ్చితంగా వినాయత నిమజ్జనం వినాయక సాగర్​లోనే చేస్తాం.'' -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఈ రోజు ఉదయం గణేశ్‌ నిమజ్జనం విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లో పలుచోట్ల హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి, భాజపా, విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా ఎంజే మార్కెట్‌ కూడలి వద్ద అందోళనకు దిగాయి. ఏటా జరుపుతున్నట్లుగానే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశాయి. కూకట్‌పల్లి వై కూడలి వద్ద బజరంగ్‌దళ్‌, వీహెచ్​పీ నాయకులు ఆందోళన చేపట్టారు. వినాయకుని నిమజ్జనానికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. హుస్సేన్ సాగర్​లో గణేశ్‌ నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

ఎక్కడా ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదు: దేశంలో ఎక్కడా ఇంత పెద్దగా వినాయక చవితి ఏర్పాట్లు చేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. గణేశ్​ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి తలసాని ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు. నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు.

ట్యాంక్‌బండ్​లోనే గణేష్ నిమజ్జనాలు చేద్దామన్న బండి సంజయ్

ఇవీ చదవండి: నిమజ్జనంపై గందరగోళం వద్దు.. ట్యాంక్​బండ్​పై ఏర్పాట్లు జరుగుతున్నాయన్న తలసాని

'దేశంలో ఎన్నో సవాళ్లు.. రాహుల్​ అధ్యక్షుడైతేనే సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.