ETV Bharat / state

'866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన గోదావరి

author img

By

Published : Aug 6, 2019, 9:34 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 866.10 అడుగులకు చేరింది. మరోవైపు... ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట, భద్రాచలం వద్ద గోదావరిలో వరద నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా... భద్రాచలం వద్ద ఉపసంహరించారు.

'866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన వరద గోదావరి

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2 లక్షల 62 వేల 64 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు... ప్రస్తుతం 866.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 126.66 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.

'866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన వరద గోదావరి

మరోవైపు.. వరద గోదారి శాంతించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద మరింత తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 12.1 అడుగులు ఉండగా... సముద్రంలోకి 12.51 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. తూర్పు గోదావరి డెల్టా కాల్వలకు 10,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అటు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా తగ్గుతోంది. ప్రస్తుత నీటిమట్టం 42.7 అడుగులుగా ఉంది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.

ఇదీ చదవండి...

మంపు ప్రాంతాల్లో గోదా'వర్రీ'...కొనసాగుతున్న వరద

Intro:మదనపల్లిలో వరుస దొంగతనాలు


Body:పోలీసులకు కంటి మీద అ కునుకు కరువు


Conclusion:చిత్తూరు జిల్లా మదనపల్లిలో లో వరుస దొంగతనాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత వారం రోజులుగా ప్రతిరోజు పట్టణంలో ఎక్కడో ఒకచోట దొంగతనం జరుగుతుంది మంగళవారం పట్టపగలే ఉదయం మధ్యాహ్నం పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో రెండు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి ఇంటిలో ఎవరు రు లేని సమయం చూసుకొని దొంగతనానికి పాల్పడుతున్నారు వారం రోజులుగా పట్టణంలో లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు దొంగలు ఒక ఒక పథకం ప్రకారం దొంగతనాలు చేస్తుండడం పోలీసులను కలవరపెడుతోంది తాళం వేసిన ఇండ్లను ఉంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు వారం రోజుల్లో లో ఆరు దొంగతనాలు జరిగాయి ప్రశాంత్ నగర్ నీరుగట్టువారిపల్లెలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఇందులో లో దొంగలు భారీ స్థాయిలో లో నగదు నగలు దొంగిలించుకొని వెళ్లారు నిందితులను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరోవైపు జిల్లాలో జరుగుతున్న జాతరలకు పోలీసు సిబ్బందిని బందోబస్తుకు పంపడంతో రాత్రి సమయంలో గస్తీలు తగ్గాయి నిందితుల ను ను పట్టుకోడానికి తీవ్రంగా అ ప్రయత్నిస్తున్నామని డి.ఎస్.పి తెలిపారు బై టు చిదానంద రెడ్డి డి ఎస్ పి మదనపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.