Telangana News: టాప్ న్యూస్​ @9AM

author img

By

Published : May 13, 2022, 9:00 AM IST

Telangana News:

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్​ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. 57 మంది ఎంపీల పదవీకాలాలు జూన్​ 21 నుంచి ఆగస్టు ఒకటిలోపు పూర్తి కానున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలున్నాయి. జూన్​ 10న పోలింగ్​, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉండనుంది.

  • భాషా పరిజ్ఞానం గల వారివైపే మొగ్గు

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన సన్నాహాల్లో ఉన్న ఆయన జాతీయ రాజకీయాల కోణంలో దిల్లీలో కీలకపాత్ర పోషించగల వారికే రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.

  • ప్రాంక్‌స్టర్​పై కరాటే కల్యాణి దాడి

హైదరాబాద్​లోని ఎస్‌ఆర్‌ నగర్ పరిధిలో మధురానగర్​లో యూట్యూబ్‌ ప్రాంక్‌స్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, సినీనటి కరాటే కల్యాణికి మధ్య గొడవ జరిగింది. ప్రాంక్‌ వీడియోలు తీయడంపై శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి కల్యాణి నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది.

  • రష్యాకు మరో తలనొప్పి

రష్యాతో 1340 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉన్న ఫిన్లాండ్​.. నాటోలో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్‌లో వచ్చేవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్వీడన్‌ కూడా ఫిన్లాండ్​ బాటలోనే పయనించే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన రష్యా.. ఐరోపాలో భద్రత, స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

  • ప్రారంభానికి సిద్ధమైన బుద్ధవనం

నాగార్జునసాగర్‌లో నిర్మిస్తున్న 'బుద్ధవనం' ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. రేపు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జాతికి అంకితం కానుంది. దేశంలోనే తొలిసారిగా బుద్ధుడి పుట్టుక నుంచి మహా పరినిర్యాణం వరకు పూర్తి చరిత్ర ఒకే చోట తెలుసుకునేలా ఈ క్షేత్రం నిర్మించారు.

  • తొలిసారి లక్ష కోట్ల మార్కు దాటిన రాబడి

అధిగమించింది. లక్షా ఆరు వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా... లక్షా తొమ్మిది వేల కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు వివిధ పన్నుల ద్వారా జమ అయ్యాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రుణాలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా 75వేల కోట్లు సమకూరగా లక్షా 66 వేల కోట్ల వ్యయం చేసింది.

  • పారదర్శకతకు సాంకేతిక అస్త్రాలు

ఈసారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. సుమారు 17 వేల పోస్టుల భర్తీ నేపథ్యంలో తొలిదశ నుంచే అక్రమాలకు ఆస్కారమివ్వకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు.

  • భారతీయుల్లో మధుమేహం ముప్పు

భారతీయుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ బాధితులు కావొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. టైప్‌-2 మధుమేహానికి జన్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో తెలుసుకునేందుకు జనాభా నిర్దిష్ట జన్యుపర వ్యత్యాసాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

  • వారి బాటలో యువ నాయికలు

ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌. అగ్ర కథానాయకుల నుంచి.. కుర్ర హీరోల వరకు అందరూ ఇదే పంథాలో నడుస్తున్నారు. మంచి కథ కుదిరిందంటే చాలు.. హిందీ సహా నాలుగైదు భాషల్లో విడుదల చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ ఫీవర్‌ కథానాయికల్ని పట్టుకుంది. అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ వంటి అగ్ర కథానాయికలంతా ఇప్పటికే పాన్‌ ఇండియా కథలతో అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడీ రేసులోకి కొత్తతరం నాయికలు వచ్చి చేరుతున్నారు. మెరుపులు మెరిపించేందుకు సెట్స్‌పై చకచకా ముస్తాబవుతున్నారు.

  • అగ్ర హీరోల క్రేజీ ప్రాజెక్టులు..

టాలీవుడ్​ అగ్ర హీరోలు జూన్​లో క్రేజీ ప్రాజెక్టులను పట్టాలపైకి ఎక్కించనున్నారు. ఎన్టీఆర్-కొరటాల, మహేశ్-త్రివిక్రమ్​, పవన్​ కల్యాణ్​-సముద్రఖని సినిమాల షూటింగ్ ప్రారంభంకానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.