ETV Bharat / state

Etela rajender on KCR: 'హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ బయటికొచ్చారు'

author img

By

Published : Nov 18, 2021, 5:10 PM IST

రైతులు సన్న వడ్లు వేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పినా సీఎం కేసీఆర్.. ఇప్పుడేందుకు కొనడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన ఏకపక్ష నిర్ణయాలతో రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. రైతు సంఘాల నేతలను, మిల్లర్ల సూచనలను పట్టించుకోలేదని ఆరోపించారు.

etela Rajender fire on cm kcr
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(

కేంద్రంపై యుద్ధం కాదు.. రాష్ట్రంలో కేసీఆర్‌ పతనం ఆరంభమైందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(etela Rajender) విమర్శించారు. రైతులు కన్నీళ్లు పెడుతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్శకు నీరెత్తినట్లుగా తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్న ఆయన.. అన్నీ తనకే తెలుసని అహంకార పూరితంగా వ్యవహిస్తున్నారని అన్నారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రైతులు కంటిమీద కునుకు లేకుండా ధాన్యానికి కాపలా కాస్తూ ప్రాణాలు విడుస్తున్నారని తెలిపారు. ఒకసారి వరి.. మరోసారి పత్తి వేయొద్దన్నారు.. రైతులను సన్న వడ్లు వేయాలని చెప్పి.. తీరా పంట వచ్చాక కొనలేదని ఈటల మండిపడ్డారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

నోరు విప్పితే అబద్ధాలే..

సీఎం కేసీఆర్(cm kcr) నోరు విప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని ఈటల అన్నారు. దాదాపు 40 రోజులుగా పల్లెల్లో వరి ధాన్యం రంగుమారి, వర్షాలకు తడిసి మొలక వస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా.. వారి వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతున్నారని ఈటల ఆరోపించారు. గతంలో ధర్నా చౌక్​ను నిషేధించిన కేసీఆర్ అదే ధర్నా చౌక్​లో ధర్నాకు దిగారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు.. కేవలం 18 గంటలే విద్యుత్ వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఇన్ని రకాల మాటలు మాట్లాడుతారా? మీ మాటలు విని రంగారెడ్డి జిల్లాలో పాలీహౌస్​లు వేసుకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్, ఆయన కుటుంబానికి రాష్ట్రంలో భవిష్యత్ లేదని విమర్శించారు.

హుజూరాబాద్ దెబ్బకు బయటికొచ్చారు..

హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కో ఓటుకు 6 నుంచి 20 వేల వరకు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అక్కడ ప్రజలు చెంప చెల్లు మనిపిస్తే.. ప్రగతి భవన్ నుంచి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతుబంధు కాదు... రైతు ద్వేషి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి టన్నుల ధాన్యం పండే రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం గొప్పలు చెప్పుకోలేదా? అని ఈటల ప్రశ్నించారు. హుజురాబాద్‌లో పెట్టిన ఖర్చు రాష్ట్ర రైతుల కోసం పెట్టలేరా అని నిలదీశారు. హుజురాబాద్‌ ఫలితం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విపక్ష నేతలను నరుకుతా, ముక్కలు చేస్తా అని బెదిరించడం సబబేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క రైతుబంధు ఇచ్చి.. మిగతా ప్రయోజనాలు ఆపేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలకు బియ్యం ఇస్తున్నమని పదేపదే కేసీఆర్ చెబుతుంటరు. నీళ్ల గురించి నాకున్న అవగాహన లేదని సీఎం అంటారు. ఆయన ఎన్ని సార్లు మాటలు మార్చిండో. ఒకసారి వరి వద్దు. మరోసారి పత్తి వద్దు అని చెబుతారు. బియ్యం ఎక్కువగా వాడే రాష్ట్రాలు కేరళ, తమిళనాడు వద్దని చెబితే రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి మన మిల్లులు సరిపోవని చెప్పిన్రు. రైతు సంఘాలు, మిల్లర్లు చెప్పిన మాటలు ఆయన వినలేదు. కానీ కేసీఆర్ బలవంతంగా కలెక్టర్లకు ఆర్డర్లు ఇచ్చి సన్న వడ్లు వేయమని చెప్పిండ్రు. ఇప్పుడేమో వ్యవసాయశాఖ మంత్రి వరి వేస్తే ఉరి అంటున్నారు. కోటి టన్నుల వడ్లను క్రషింగ్ చేసి అమ్మగలిగే కెపాసిటీపై అలోచన లేదా? నీళ్లు వచ్చాక ఐదేరేళ్లలో కరువు రాలే.. పెద్దఎత్తున వర్షాలు పడి వరిపంట పండింది. నీళ్లు రైతులకు కళ్లముందే ఉన్నాయి కాబట్టి పండిస్తున్నరు. వరి వేస్తే ఉరి అని ఎలా చెబుతారు. కేంద్రం ఏం చెప్పింది. 40 లక్షల హెక్టార్ల పంట కొంటామని చెప్పింది. ఇవాళ హుజూరాబాద్​లో వందల కోట్లు ఖర్చు పెట్టి ..పలు రకాలు జీవోలు ఇచ్చిండ్రు. ఈ దేశ ప్రజాస్వామ్యమే అసహ్యించుకునే రీతిలో ప్రలోభ పెట్టినా కూడా హుజూరాబాద్ ప్రజలు గొప్ప తీర్పునిచ్చి కేసీఆర్ చెంప చెల్లుమనిపించుండ్రు.- ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

MLA Etela Rajender : 'ధర్నాచౌక్​వద్దన్న వాళ్లే ధర్నాలు చేస్తే ఎలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.