ప్రతి ఏడాదీ మహాలయ అమావాస్యనాడు ప్రారంభమై దుర్గాష్టమితో బతుకమ్మ పండుగ(Bathukamma festival) ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజులూ అనేక రీతుల్లో బతుకమ్మను ఆరాధించడం సంప్రదాయం. ఈ తొమ్మిది దినాలూ బతుకమ్మకు నవరాత్రోత్సవాలే. ఇళ్లలో, ఇళ్లవాకిళ్లలో, దేవాలయ ప్రాంగణాల్లో, ఊరి కూడళ్లలో బతుకమ్మను పూలతో శిఖరంలా పేర్చి, స్త్రీలు వర్తులాకారంలో బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ ఉంటే నేత్రపర్వంగా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో రోజుకో తీరుగా బతుకమ్మను పేరుస్తారు. ఇవాళ ఎనిమిదో రోజు సందర్భంగా 'వెన్నముద్దల బతుకమ్మ'గా పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను(Bathukamma celebrations in telangana) వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యం సమర్పిస్తారు. పాట ప్రధానంగా సాగే బతుకమ్మ సంబరాల్లో ఎనిమిదో రోజున అమ్మను 'వెన్నముద్దల బతుకమ్మ' అని పిలుస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్నముద్ద, బెల్లం.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, పట్టుకుచ్చు వంటి తీరొక్క పూలతో ఎనిమిదంతరాల బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపు గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేస్తారు. సాయంత్రం వర్తులాకారంలో బతుకమ్మలు పెట్టి... కోలాటాలు చేస్తారు.
రోజుకో ప్రత్యేకత
తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ... రెండో రోజు అటుకుల బతుకమ్మ.. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోనాడు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అర్రెం అనగా బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఎనిమిదో రోజు సందర్భంగా 'వెన్నముద్దల బతుకమ్మ'గా పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం.. వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో పేరుతో కొలుస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు.
గంగమ్మ చెంతకు బతుకమ్మ
సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు.
ప్రాణికోటిని బతికించే తల్లి బతుకమ్మ. పేరులోనే జీవితాన్ని కలిగిన బతుకమ్మ స్వరూపం పుష్పశిఖరం. పూలలో తన రూపాన్ని ఆవిష్కరించే ఈ తల్లి, ప్రాణి జీవితం పువ్వువంటిదే అని సందేశం ఇస్తుంది. తొమ్మిది రోజుల పాటు పిల్లాపెద్దా తేడాలేకుండా ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నారు.
ఇవీ చదవండి:
- engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ
- Bathukamma day 2: రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'.. నైవేద్యం ఏంటంటే?
- Bathukamma day 3, 2021: మూడో రోజు 'ముద్దపప్పు బతుకమ్మ' విశేషాలు..
- Bathukamma DAY-4: నాలుగో రోజు'నానబియ్యం బతుకమ్మ'.. ఎలా చేయాలంటే?
- Bathukamma Festival: ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'.. ప్రత్యేకతలు ఏంటంటే..!