ETV Bharat / state

SABITHA INDRA REDDY: విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం

author img

By

Published : Aug 28, 2021, 4:55 PM IST

Updated : Aug 28, 2021, 5:43 PM IST

విద్యా సంస్థల ప్రారంభానికి(ts schools reopen) ఇదే సరైన సమయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRA REDDY) అన్నారు. ఇంట్లో మాదిరిగానే విద్యా సంస్థల్లో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభానికి విద్యా సంస్థలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలలకు పంపాలని బలవంతం చేయబోమంటున్న విద్యాశాఖ మంత్రి సబితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

SABITHA INDRA REDDY, ts schools reopen
సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం

సబితా ఇంద్రారెడ్డితో ముఖాముఖి

ప్రస్తుతం కరోనా(corona) అదుపులో ఉందని... విద్యా సంస్థల ప్రారంభానికి(schools reopen) ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRA REDDY) అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇంట్లో మాదిరిగానే విద్యా సంస్థల్లో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. హైదరాబాద్‌లోని మహబూబియా ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి... సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభానికి విద్యా సంస్థలను సిద్ధం చేస్తున్నామని వివరించారు.

ప్రత్యక్ష బోధన మాత్రమే..

విద్యార్థులను పాఠశాలలకు పంపాలని బలవంతం చేయబోమని స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధన మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఆన్‌లైన్ బోధనతో(online classes) పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరట్లేదని వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు జరిపి ఇంటికి పంపిస్తామని వివరించారు. పాఠశాలలు నెలవారీగానే ఫీజులు తీసుకోవాలని సూచించారు.

పాఠశాల యాజమాన్యాలు మానవీయంగా వ్యవహరించాలి. ఫీజుల చెల్లింపులో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి. 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు వ్యాక్సిన్లు(vaccination) వేయించే ప్రయత్నం చేస్తాం. విద్యా వాలంటీర్లు, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై సరైనవేళ నిర్ణయం తీసుకుంటాం. ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేకుండా పాస్ చేస్తే ఉద్యోగాలు పొందేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.

-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

ఇదీ చదవండి: Praja Sangrama Yatra: కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం

Last Updated :Aug 28, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.