ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఈసీ కసరత్తు

author img

By

Published : Jun 23, 2023, 7:35 AM IST

EC Team Visits in Hyderabad : రాష్ట్రంలో గత ఎన్నికల అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. వచ్చే శాసనసభ ఎన్నికలు మరింత సమర్థంగా, లోపరహితంగా జరిగేందుకులా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. శాఖల ఉన్నతాధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో సమావేశమైన ఈసీ బృందం.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. డబ్బు, ఇతర ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని, పొరుగు రాష్ట్రాలు సహా పరస్పర సహకారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి సమర్థంగా నిర్వహించేలా చర్యలు

EC on Telangana Assembly Elections 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల సన్నాహకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, స్పెషల్ పోలీస్, కేంద్ర బలగాల నోడల్ అధికారులతో సమావేశమై.. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై దిల్లీ నుంచి వచ్చిన ఈసీ బృందం సభ్యులు ఆరా తీశారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలు, అధికారులకు శిక్షణ తదితర అంశాలను సీఈవో వివరించగా.. బందోబస్తు ప్రణాళిక, ఇతరత్రా అంశాలను నోడల్ అధికారులు వివరించారు.

EC Delegation Visits Telangana : 2018 ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి సమర్థంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఈసీ బృందం సభ్యులు సూచించారు. బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలన, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు జాబితాలో పేర్లు లేకుండా చూడాలన్నారు. సీబీడీటీ, ఎన్సీబీ, ఎక్సైజ్, జీఎస్టీ, ఈడీ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి, డీఆర్‌ఐ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కూడా ఈసీ బృందం సభ్యులు సమావేశమయ్యారు.

EC Team Visits in Hyderabad : ఎన్నికల సమయంలో డబ్బు, ఇతర ప్రలోభాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పూర్తి సమన్వయంతో పనిచేయాలని, పొరుగురాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టు వ్యవస్థ పకడ్బందీగా ఉండాలని ఈసీ బృందం సభ్యులు సూచించారు. గత ఎన్నికల సమయంలో ఎక్కువగా నగదు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల జాబితా, ఇతర అంశాల ప్రాధాన్యం దృష్ట్యా.. కొంతమంది బీఎల్ఓలతో ఈసీ బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఇంటింటి పరిశీలన, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు. ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నాహకాలు, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్ర శాసనసభకు వచ్చే ఏడాది జనవరి 16లోగా ఎన్నికలు పూర్తి అయి కొత్త సభ కొలువు తీరాల్సి ఉంది. దీనికిగానూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహకాలను ప్రారంభించింది. ఓటర్ల జాబితా తయారీ, అధికారులకు శిక్షణ, ఈవీఎంలు సిద్ధం చేయడం సహా సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను కూడా చేపట్టింది. బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలనా ప్రక్రియను చేస్తుంది.

EC on Telangana Assembly Elections : ఈ క్రమంలోనే ఆగస్టు 2న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించి.. దానిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి అక్టోబర్ 4న ఓటర్ల తుదిజాబితా ప్రకటించనున్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీతో పాటు అధికారులకు శిక్షణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. వీటితో పాటు ఇతర సన్నాహకాలు, కసరత్తు, ఏర్పాట్లను ఈసీ బృందం మూడు రోజుల పాటు సమీక్షించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ అధికారుల బృందం నగరానికి చేరుకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.