హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి

author img

By

Published : Nov 21, 2019, 5:37 AM IST

హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి చేరనుంది. నగర ప్రజలు ఎదురు చూస్తున్న దుర్గం చెరువు తీగల వంతెన పనులు పూర్తి కావస్తున్నాయి. వంతెన నిర్మాణంలో కీలకమైన సెగ్మెంట్ల అమరిక తుదిదశకు చేరుకుంది. సంక్రాంతి కల్లా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని జీహెచ్​ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.


హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణంలో కీలక సెగ్మెంట్‌ల అమరిక పూర్తికావచ్చింది. మొత్తం 53కు గానూ 50 సెగ్మెంట్లు ఉక్కు తీగలకు అనుసంధానం చేశారు. ఒక్కో సెగ్మెంట్‌ 26 మీటర్ల ఎత్తు, 4 మీటర్ల వెడల్పుతో 160 టన్నుల బరువు ఉంటుంది. మరో వారం రోజుల్లో మిగిలిన రెండు సెగ్మెంట్ల పనులు పూర్తి చేసి.... కీ సెగ్మెంట్‌ అమరిక పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని.... జీహెచ్​ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ఫ్లై ఓవర్​పైనా పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో తుది మెరుగులు దిద్ది సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

దేశంలోనే పొడవైన వంతెన...

దుర్గం చెరువు తీగల వంతెన పొడవు సుమారు 755 మీటర్లు. మధ్యలో సుమారు 234మీటర్ల దూరంలో 57 మీటర్ల ఎత్తైన రెండు స్తంభాలు నిర్మించారు. వంతెన నిర్మాణ వ్యయం రూ. 184 కోట్లు కాగా... విద్యుద్దీపాల అలంకరణకు రూ. 11 కోట్లు, ప్రహరీ నిర్మాణానికి రూ. 15 కోట్లు కేటాయించారు. సెగ్మెంట్ల అమరిక పూర్తయితే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినట్లే. తరువాత రంగు రంగుల విద్యుద్దీపాలతో తీగల వంతెనను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నన్నారు. పనులన్నీ పూర్తయితే...దేశంలోనే పొడవైన తీగల వంతెనగా దుర్గం చెరువు వంతెన నిలవనుంది.

అందాలను ఆస్వాదించొచ్చు...

ఎత్తైన, విశాలమైన తీగల వంతెన అందుబాటులోకి వస్తే.. పర్యాటకులు వంతెన మీదుగా నడుస్తూ దుర్గంచెరువు, ఐటీకారిడార్‌ అందాలను ఆస్వాదిస్తారు. పర్యాటకులను ఆకర్షించడమే గాక... వంతెన పూర్తైతే ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి. రోడ్డు నెంబర్ 45 మీదుగా... అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి నేరుగా ఇనార్బిట్‌మాల్‌ ముందున్న రోడ్డుపైకి చేరుకోవచ్చు. ఇందుకోసం జీహెచ్​ఎంసీ రోడ్డు నెంబర్ 45లో పైవంతెన నిర్మిస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 36, హైటెక్‌సిటీ, మాదాపూర్‌ రోడ్లపైనా వాహన రద్దీ తగ్గనుంది.

చార్మినార్‌, సైబర్‌ టవర్స్‌, బిర్లామందిర్‌ మాదిరిగా దుర్గం చెరువు వంతెన పర్యాటక ఆకర్షక కేంద్రంగా మారుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

భాగ్యనగర సిగలో మరో కలికితురాయి

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

TG_HYD_12_21_Durgam_Cheruvu_Cable_Bridge_Pkg_3182301 Reporter: Kartheek () హైదరాబాద్ నగర సిగలో మరో అందల నగ చేరనుంది. ఎప్పుడెప్పుడా అని నగర ప్రజలు ఎదురు చూస్తున్న తీగల వంతెన పనులు పూర్తికావస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణానికి కీలకమైన సెగ్మెంట్ల అమరిక తుదిదశకు చేరుకుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో బంజారాహిల్స్‌, హైటెక్ సిటీ మధ్య దూరం తగ్గనుంది. సంక్రాంతి వరకు కేబుల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. ఇదీ పూర్తయితే హైదరాబాద్ నగరంలో మరో పర్యటక ప్రదేశం ఏర్పాటు కానుంది. Look వాయిస్ ఓవర్ః హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో కీలక ఘట్టం అయిన సెగ్మెంట్ ల అమరిక పూర్తికావచ్చింది. మొత్తం 53 సెగ్మెంట్లకు 50 సెగ్మెంట్లు ఉక్కు తీగలకు అనుసంధానం చేశారు. ఒక్కో సెగ్మెంట్‌ 26మీటర్లు పొడవు, ఎత్తు, వెడల్పు నాలుగు మీటర్లు మొత్తం ఒక్కో సెగ్మెంట్ 160 టన్నుల బరువు ఉంటుంది. మరో వారం రోజుల్లో మిగిలి రెండింటిని ఎక్కిస్తామని.. చివరి కీ సెగ్మెంట్‌ అమరిక పనులను ఈ నెలఖారు వరకు పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఫ్లై ఓవర్ పైన కూడా పనులు చురుకుగా సాగుతున్నాయి. ఫ్లైఓవర్ పైన రోడ్డు తో పాటు... ప్రహారీ పనులు చేస్తున్నారు. రానున్న రెండు నెలల్లోపు తుది మెరుగులద్దే పనులు పూర్తిచేసి సంక్రాంతికి ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకోస్తామని చెబుతున్నారు. వాయిస్ ఓవర్ః దుర్గం చెరువు తీగల వంతెన 754.83 మీటర్ల పొడవు. మధ్యలో 233.8 మీటర్ల దూరంతో 57 మీటర్ల ఎత్తైన రెండు ఎత్తైనా స్తంభాలు నిర్మించారు. దీని నిర్మాణ వ్యయం 184 కోట్ల రూపాయలు, విద్యుద్దీపాలంకరణానికి 11 కోట్లు, ప్రహరీ నిర్మాణ వ్యయం 15 కోట్లు రూపాయలు కేటాయించారు. ఇదీ పూర్తయితే దేశంలోనే పొడవైన తీగల వంతెనగా దుర్గం చెరువు వంతెన నిలవనుంది. రెండు పైలాన్లకు ఇరువైపులా 13 భారీ ఉక్కుతీగలు వేలాడదీశారు. సెగ్మెంట్ల అమరిక పూర్తవగానే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినట్లే. తరువాత రంగు రంగుల విద్యుద్దీపాలతో తీగల వంతెనను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నన్నారు. చార్మినార్‌, సైబర్‌టవర్స్‌, బిర్లామందిర్‌ వంటి పలు నిర్మాణాలను ఇప్పటి వరకు నగరానికి సూచికలుగా భావిస్తున్నారు. వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఐటీకారిడార్‌లో తీగల వంతెనను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ఎత్తైన, విశాలమైన తీగల వంతెన అందుబాటులోకి వస్తే.. పర్యాటకులు వంతెన మీదుగా నడుస్తూ దుర్గంచెరువు, ఐటీకారిడార్‌ అందాలను ఆస్వాదిస్తారు. ఆ ప్రాంతం పర్యాటకంగా ప్రాచుర్యం పొందుతుంది. దీంతోపాటు ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుముఖంపడతాయి. రోడ్డు నెంబర్ 45 మీదుగా అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలోపలి నుంచి నేరుగా ఇనార్బిట్‌మాల్‌ ముందున్న రోడ్డుపైకి చేరుకోవచ్చు. అందులో భాగంగా జీహెచ్‌ఎంసీ రోడ్డు నెంబర్ 45లో పైవంతెన నిర్మిస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 36, హైటెక్‌సిటీ, మాదాపూర్‌ రోడ్లపై వాహన రద్దీ తగ్గుతుంది. ఎండ్ పీటూసీ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.