ETV Bharat / state

కనకదుర్గ అమ్మవారికి మూడు బంగారు కిరీటాలు కానుక.. బరువు ఎంతంటే?

author img

By

Published : Sep 12, 2022, 6:52 PM IST

Gold Crowns To Kanakadurga Goddess : ఆంధ్రప్రదేశ్‌లో ఇందకీలాద్రి అమ్మవారికి ఓ భక్తుడు 1308 గ్రాముల బరువైన 3 బంగారు కిరీటాలను బహుకరించారు. ఈ బంగారు కిరీటాలను ఆలయ ఈవో భ్రమరాంబకు అందించారు.

Gold Crowns To Kanakadurga Goddess
Gold Crowns To Kanakadurga Goddess

GOLD CROWNS TO BEZAWADA KANAKADURGA : ఏపీ విజయవాడ కనకదుర్గ అమ్మవారికి నవీ ముంబై రెకాన్‌ మెరైన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి 3 బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహా అలంకరణ కోసం సుమారు 1308 గ్రాముల బరువు గల కిరీటాలను ఆలయ ఈవోకు అందజేశారు. దాత కుటుంబానికి దర్శనాంతరం.. ప్రధాన అర్చకులతో వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో.. దాతకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.