ETV Bharat / state

దా‘రుణ’ యాప్‌ల వ్యవహారంలో ఆరుగురి అరెస్ట్‌

author img

By

Published : Dec 22, 2020, 3:12 PM IST

Updated : Dec 22, 2020, 5:27 PM IST

రుణ యాప్​ల దందాపై సైబరాబాద్​ పోలీసులు కొరడా ఝళిపించారు. దా'రుణ' యాప్​ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 చరవాణులు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.52 కోట్లు నిల్వ ఉన్న 18 బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేశారు.

దా'రుణ' యాప్‌ల దందాపై పోలీసుల కొరడా... ఆరుగురు అరెస్టు
దా'రుణ' యాప్‌ల దందాపై పోలీసుల కొరడా... ఆరుగురు అరెస్టు

కస్టమర్లను వేధింపులకు గురిచేస్తున్న ఆన్​లైన్​ లోన్​ యాప్స్​పై సైబరాబాద్​ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటివరకూ కమిషనరేట్​ పరిధిలో 5 కేసులు నమోదు కాగా.. దర్యాప్తులో రెండు కంపెనీలకు సంబంధించి ఆరుగురు నిందితులను సైబరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్​కు తరలించారు. వీరి నుంచి 22 చరవాణులు, 3 కంప్యూటర్లు, 3 లాప్​టాప్స్​ స్వాధీనం చేసుకున్నారు.

18 బ్యాంక్​ ఖాతాలకు సంబంధించి 1.52 కోట్ల నగదును స్తంభింపజేశారు. రాయదుర్గంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆనియన్ క్రెడిట్ ప్రైవేటు లిమిటెడ్, సీఎస్ ఫాక్స్ టెక్నాలజీ రెండు కంపెనీలు నడుపుతున్న శరత్​ చంద్ర 110 మంది సిబ్బందిని నియమించుకున్నారు. సొంతంగా కొన్న యాప్​లను రూపొందించి.. గూగుల్ ప్లేస్టోర్​లో ఉంచి అప్పు తీసుకున్న వారి నుంచి 35 శాథం వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఆర్బీఐతో పాటు ఎంబీఎఫ్​సీ నిబంధనలు ఏ ఒక్కటీ పాటించడం లేదని పోలీసులు గుర్తించారు. ఈ యాప్​లపై ఆయా ప్రతినిధులతో మాట్లాడతామని సైబరాబాద్​ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 22, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.