ETV Bharat / state

వారి ముచ్చట్లు విన్నారా - మీ ఖాతా ఖాళీ అయినట్లే

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 1:22 PM IST

Cyber Crime Safety Measure : ఇప్పటి కాలంలో అందరు అలవాటు పడిన డిజిటల్ పేమెంట్స్​ మాయగాళ్లకు అవకాశంగా మారింది. విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, ఐటీ వీరినే టార్గెట్​ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఒక రాష్ట్రంలోనే ఉన్న నేరాగాళ్లు దేశమంతటా విస్తరించి సామాన్య ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు.

New Trends in Cyber Crime
Cyber Crime Safety Measure

Cyber Crime Safety Measure : కరోనా అనంతరం డిజిటల్ లావాదేవీలు క్రెడిట్​/డెబిట్​ కార్డుల వినియోగం తప్పనిసరి కావడంతో సైబర్ (Cyber Crime) మాయగాళ్లు సామాన్య ప్రజలను హడలెత్తిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల​ పరిధిలో 10నెలల వ్యవధిలోనే సుమారు 5 వేలకు పైగా సైబర్ కేసులు నమోదైనట్లు అంచనా. ముఖ్యంగా వీటిలో కస్టమర్​కేర్​ సెంటర్​, ఓటీపీ ద్వారా సొమ్ము పోగొట్టుకున్నవి, పాన్​కార్డు అప్​డేట్​, పాన్​ నంబర్లకు ఖాతా లింక్​ చేస్తామంటే నమ్మి మోసపోయిన కేసులు 1500లకు పైగా ఉన్నాయి.

whats app: వాట్సాప్​ గడ్డ.. సైబర్​ నేరగాళ్ల నూతన అడ్డా!!

New Trends in Cyber Crime : ఎనీడెస్క్​/వ్యూయర్​ యాప్​ల ద్వారా బాధితుల సెల్​ఫోన్​, ల్యాప్​ట్యాప్​లను సైబర్​ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతా నెంబరు, ఓటీపీలతో సామాన్యుల సొమ్మంతా ఖాళీ చేస్తుంటారు. బాధితుల్లో ఎక్కువ విశ్రాంత ఉద్యోగులు, విద్యావంతులు, ఐటీ నిపుణులు, గృహిణులు, వ్యాపారులు ఉంటున్నారు. కొట్టేసిన నగదును నిందితులు క్రిప్టో కరెన్సీగా మార్చి డిజిటల్ హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు.

ఇలాంటి లింకులు వస్తే క్లిక్​ చేయకూడదు :

  • గుర్తుతెలియని వ్యక్తులు/సంస్థల పేరుతలో ఫోన్​కు, వాట్సప్​లకు వచ్చే లింకులను క్లిక్​ చేయకూడదు.
  • ఒక్కసారి పాన్​కార్డు నంబరు వచ్చాక జీవితకాలం అదే ఉంటుంది. దానిని అప్​డేట్ చేయడం ఉండదు.
  • బ్యాంకు ఖాతాలతో పాన్​కార్డు అనుసంధానించాలను ఫోన్ వస్తే సంబంధిత బ్యాంకుకు నేరుగా వెళ్లి అధికారులను సంప్రదించండి. ఫోన్​లో అడుగుతే ఎలాంటి ఓటీపీలు చెప్పుకూడదు.
  • సైబర్​ నేరం బారిన పడితే వెంటనే టోల్​ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయండి. వారి ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.

Hyderabad Police Arrested Cyber Gang : సైబర్‌ మోసాల్లో 'ఉగ్ర' లింకుల కలకలం

Cyber Crimes Rising With Growing of Digital Payments in India : నామమాత్రం చదువులు.. ఆకతాయిగా తిరిగే కుర్రాళ్లు, ఒంటికి చెమట పట్టకుండా చాలా సులువుగా రూ.లక్షలు కొట్టేస్తున్నారు. గతంలో ఝార్ఖండ్ జాంతారాకే పరిమితమైన ఇప్పుడు వీరు దేశమంతటా విస్తరించారు. బిహార్, ఛత్తీస్​గఢ్​, పశ్చిమ బంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్​లల్లో గ్రూపులుగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలకు తెరలేపారు. భరత్​పూర్, పట్నా, బెగుసరాయ్, ధన్​బాగ్, కోల్​కతా నుంచి దేశవ్యాప్తంగా నెట్​ ఏర్పాటు చేసుకొని దందా కొనసాగిస్తున్నారు.

Part Time Job Scam Hyderabad : గృహిణులే లక్ష్యం.. పార్ట్​టైం జాబ్ పేరుతో మోసం.. 6 నెలల్లో రూ.500 కోట్లు లూటీ

ఆన్​లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలు, పాన్​కార్డులు, ఆధార్​కార్డులు, ఫోన్​ నంబర్లు సేకరిస్తున్నారు. రోజూ ఒక్కొక్కరు దాదాపు 200-300 ఫిషింగ్ సందేశాలు, మెయిల్ చేస్తుంటారు. ఆయా లావాదేవీలు నిలిపివేస్తారనే ఆందోళనతో లింకులను క్లిక్​ చేసిన వారి బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిందితుల ఖాతాను ఆపేసినా అప్పటికే వారు దోచుకున్న నగదు వేర్వేరు ఖాతాలోకి చేరిపోతుంది.

Kavach Application : 'కవచ్'​.. సైబర్ మోసాన్ని ఇట్టే పసిగట్టేస్తుంది.. మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది..

పోయిన చోటే రాబట్టుకోవాలని.. రూ.87లక్షలు కోల్పోయాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.