ETV Bharat / state

సైబర్​ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం...

author img

By

Published : Sep 25, 2019, 5:17 PM IST

ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదివింది. మంచి తెలివితేటలూ ఉన్నాయి. కానీ... ఆ విజ్ఞానాన్ని మాత్రం తన అత్యాశకు వాడుకుంటోంది. ఇప్పటికే వెలుగుచూసిన ఎన్నో సైబర్​ మోసాలను చూసిన ఆ యువతి... వినూత్నంగా ఆలోచించింది. ఎవరూ ఊహించని విధంగా... మోసాలకు పాల్పడుతూ అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది...!

Cyber Cheater Lady Arrest_In Hyderabad_who targeted schools

సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. సామాజిక మాధ్యమాలు యువతకు ఎంత ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ... వారి అతితెలివికి మాత్రం ఆయుధాలుగా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన ఓ యువతి సరికొత్త వ్యూహంతో మోసానికి పాల్పడింది.

పాఠశాలలే తన టార్గెట్​...

పలు ప్రైవేట్​ స్కూళ్లకు చెందిన అధికారిన ఫేస్​బుక్​ పేజీల నుంచి ఫొటోలనే ఆయుధంగా మార్చుకుంది ఆ కిలేడి. సమావేశాలు, వేడుకలకు సంబంధించిన ఫొటోలు మార్ఫింగ్​ చేసి... యాజమాన్యానికి పంపిస్తోంది. తాను సైబర్​ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్లు వారిని నమ్మించి... సామాజిక మాధ్యమాల నుంచి ఆ ఫొటోలను తీసేసేందుకు అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్​లోని కొన్ని స్కూళ్లను కూడా డిమాండ్​ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా... అసలు విషయం బయటపడింది.

ఫోన్​లో 225 స్కూళ్ల గ్రూపులు...

దర్యాప్తు చేసిన పోలీసులు ఈ సైబర్ కిలేడిని అరెస్టు చేశారు. యువతిని విచారించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. నిందితురాలి చరవాణిలో సుమారు 225కు పైగా పాఠశాలల గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే టెక్నాలజీని వాడుకుని నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్​ అడిషనల్​ డీజీపీ రఘువీర్​ తెలిపారు.

సైబర్​ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం...

ఇవీ చూడండి: అమృతను పెళ్లి చేసుకుంటా..అగంతకుడి సీసీ వీడియో..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.