ETV Bharat / state

ధరణి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశం

author img

By

Published : Feb 12, 2021, 7:10 PM IST

హైదరాబాద్​ బీఆర్కే భవన్​లో సీఎస్ సోమేశ్​కుమార్... ధరణికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. సమావేశంలో ధరణికి సంబంధించిన అన్ని అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు.

ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సమీక్ష
ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సమీక్ష

ధరణి పోర్టల్​లో సంస్థలు, కంపెనీల పేరున రిజిస్ట్రేషన్ మాడ్యూల్... జిల్లాల్లో వినియోగం విషయంలో అధ్యయనం కోసం ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ అధికారులను ఆదేశించారు. ధరణికి సంబంధించిన అంశాలపై బీఆర్కే భవన్​లో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సమీక్ష
ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సమీక్ష

ధరణి పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్ ద్వారా 74,688 దరఖాస్తులు రాగా కలెక్టర్ల 62,847 దరఖాస్తులను పరిశీలించారని అధికారులు తెలిపారు. సంస్థలకు, కంపెనీలకు పట్టదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి అవసరమైన మాడ్యూల్ ధరణిలో అందుబాటులో ఉందని, ఎన్ఆర్ఐ మాడ్యూల్​ను కూడా అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

సంస్థలు, కంపెనీల పేర రిజిష్ట్రేషన్ మాడ్యూల్ అభివృద్ధి దశలో ఉందని, ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాల్లో మాడ్యూల్ వినియోగం విషయంలో ప్రత్యేక టీమ్​లతో గ్రామాల్లో పర్యటించాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.

ఈ టీమ్​లు మాడ్యూల్ అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని ముఖ్యంగా పార్ట్-బీలో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నత విద్యామండలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.