ETV Bharat / state

ఆధునిక దోపిడిని ప్రభుత్వం అరికట్టాలి: నారాయణ

author img

By

Published : Dec 19, 2020, 5:06 PM IST

యాప్​ల ద్వారా రుణాలు తీసుకుని.. వాటిని కట్టలేని ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆధునిక దోపిడిని ప్రభుత్వం అరికట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 50 నుంచి 60 శాతం వడ్డీ వసూలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

cpi narayana on online app lones
ఆధునిక దోపిడిని ప్రభుత్వం అరికట్టాలి: నారాయణ

ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా జరుగుతున్న దోపిడిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే దీన్ని అరికట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. యాప్‌ ద్వారా అప్పులు ఇస్తూ.. ప్రజలను మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి మోసాలు గతంలో మైక్రో ఫైనాన్స్‌ పేరిట జరిగేదని.. వాటిపై ఆనాడు ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆధునిక పద్ధతిలో దోపిడి చేస్తున్నారన్నారు. 50 నుంచి 60 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా అప్పులు ఇస్తూ.. ఫోన్‌లోనే వేధిస్తున్నారని పేర్కొన్నారు. అవమానం భరించలేకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ ఆధునిక దోపిడిని అరికట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: దొంగ రిజిస్ట్రేషన్లకు ధరణి స్వర్గధామం: మురళీధర్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.