ETV Bharat / state

Cp Anjani Kumar: 'తొలిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనాలు'

author img

By

Published : Sep 18, 2021, 4:31 PM IST

Updated : Sep 18, 2021, 6:50 PM IST

cp
అంజనీకుమార్

రేపు జరగబోయే గణేశ్​ నిమజ్జనాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన వాహనాల రూట్ మ్యాపులకు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు.

'తొలిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనాలు'

హైదరాబాద్‌లో రేపు నిమజ్జనాలకు (Ganesh Immersion) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ (Cp Anjani Kumar) తెలిపారు. వాహనాల రూట్ మ్యాప్‌ పుస్తకాన్ని (Route Map Book) సీపీ విడుదల చేశారు. తొలిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు అంజనీకుమార్ వివరించారు. నిమజ్జనాలకు దాదాపు 27 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 4 అడుగులకు పైబడి ఉన్న విగ్రహాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి బార్‌ కోడ్‌ ఇచ్చినట్లు సీపీ చెప్పుకొచ్చారు. ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌ శాఖలను సమన్వయం చేసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. బస్టాండ్లు, హోటళ్లు, రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు అంజనీకుమార్ తెలిపారు.

గణేశ్​ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాం. షాప్ యాజమాలు ఎవ్వరూ కూడా మద్యం అమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. బాలాపూర్​ నుంచి హుస్సేన్​సాగర్ వరకు 17 కిమీ ఇది ఇంపార్టెంట్ రూట్. ఈ మార్గంలో ప్రధాన ప్రాంతాల్లో బైనాక్యులర్ల సాయంతో గస్తీ నిర్వహిస్తాం.

- అంజనీకుమార్, సీపీ

గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చు. నగరంలో 3 కారిడార్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఈనెల 20న అర్ధరాత్రి ఒంటి గం.కు అన్ని చివరి స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు ఉండనున్నాయి. అర్ధరాత్రి 2 గంటలకు చివరి స్టేషన్‌కు మెట్రో రైళ్లు చేరుకుంటాయి.

గణేశ్ నిమజ్జన గూగుల్ రూట్ మ్యాప్ & ట్రాఫిక్ ఆంక్షలు

  • బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర, ఫలన్​నుమా నుంచి వచ్చే శోభాయాత్రను.. చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్​కు తరలింపు
  • సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర.. ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు
  • ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర.. రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు
  • దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా తరలింపు
  • టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర.. మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు మళ్లింపు

ట్రాఫిక్ ఆంక్షలు

  • మెహిదీపట్నం, తప్పాచబుత్రా, అసిఫ్​నగర్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సీతారాంబాగ్, బోయగూడ కమాన్, గోషామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి
  • ఈ రూట్ మ్యాప్​లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లానని పోలీసుల సూచన
  • ఎర్రగడ్డ, ఎస్సార్​నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర.. అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది

ప్రతి శోభాయాత్ర(Ganesh immersion) మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఏర్పాటు చేయనున్నారు. నీలి, ఆరెంజ్, ఎరుపు, ఆకుపచ్చ రంగులు.. వాటికి కేటాయించిన రంగు ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

ఇదీ చూడండి: Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

Last Updated :Sep 18, 2021, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.