ETV Bharat / state

భాగ్యనగరంపై కరోనా పంజా... బుధవారం 26 కేసులు

author img

By

Published : May 21, 2020, 11:25 PM IST

భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో బుధవారం 26 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

corona latest news in hyderabad
భాగ్యనగరంపై కరోనా పంజా... బుధవారం 26 కేసులు

జీహెచ్​ఎంసీ పరిధిలో బుధవారం 26 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నగరంలోని ముషీరాబాద్, మూసాపేట, సనత్ నగర్, మోతీనగర్, అల్లాపూర్ డివిజన్లలో కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. ముషీరాబాద్​లో వృద్ధుడికి కరోనా నిర్ధారణకాగా... ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్​కు తరలించారు. సనత్ నగర్ డివిజన్​లోని సుభాష్​నగర్​లో 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. మహిళను ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రికి తరలించి.. కుటుంబసభ్యులను హోంక్వారంటైన్ చేశారు.

మూసాపేటలో తండ్రికొడుకులకు కరోనా సోకింది.. కుమారుడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మోతీనగర్​లో కిరాణ దుకాణ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అల్లాపూర్​లోని ప్రతాప్ నగర్​లో బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని కలిసిన ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.