ETV Bharat / state

Corona Effect: ఉపాధి రంగాలు విలవిల... వ్యవసాయం రంగంలో పెరుగుదల

author img

By

Published : Aug 23, 2021, 8:58 AM IST

లాక్​డౌన్ ఎత్తివేసినా కొన్ని ఉపాధి రంగాలు ఇంకా కోలుకోలేదు. ఇతర రంగాల్లో తగ్గుదల ఉన్నా... వ్యవసాయ, వాటి అనుబంధ రంగాల్లో ఉత్పత్తి భారీగా పెరగడం వల్ల జీఎస్​డీపీలో పెరుగుదల నమోదైంది. గతేడాది కంటే పలు రంగాల్లో ఉత్పత్తి బాగా తగ్గి... దారుణంగా దెబ్బతిన్నాయి.

Corona Effect
కరోనా ప్రభావం

రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మినహా అన్ని కీలక రంగాలపై కరోనా ప్రభావం చూపింది. అత్యధికంగా ఉపాధిని కల్పించే రంగాలను బాగా దెబ్బతీసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇది కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా వివిధ రంగాలు అంతగా కోలుకోలేదు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్‌లు, అన్ని రకాల రవాణా రంగాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈ రంగాలన్నింటిలోనూ 2019-20 కంటే 2020-21లో ఉత్పత్తి తగ్గింది.

.

గత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌- జీఎస్‌వీఏ) తుది గణాంకాలు సిద్ధమయ్యాయి. వాటిని రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు అందించింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో మిగిలిన విభాగాల్లో ఉత్పత్తి తగ్గినా జీఎస్‌వీఏతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రాడక్ట్‌- జీఎస్‌డీపీ)లో అంతకు ముందు ఏడాది కంటే 2.4 శాతం పెరుగదల నమోదైంది. వాస్తవంగా 2014-15 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు జీఎస్‌డీపీ సగటు వృద్ధిరేటు 13 ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి పరిమితమైంది.

.

జీఎస్‌డీపీలో కీలకమైన ద్వితీయ, అనుబంధ రంగాల ఉత్పతి బాగా తగ్గడం వంటి పరిస్థితులు ఉపాధి రంగంపై పడిన ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిరేటు నమోదు చేసిన కీలక రంగాలు అన్నీ కూడా గత సంవత్సరం దారుణంగా దెబ్బతిన్నాయి. తయారీ, నిర్మాణం, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంబంధిత కార్యకలాపాలు, రవాణా, సేవల రంగం ద్వారా అత్యధిక ఉపాధి లభిస్తోంది. ఈ రంగాలన్నింటి పైనా లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాదికంటే ఈ రంగాల్లో ఉత్పత్తి తగ్గింది. వ్యవసాయం అనుబంధ రంగాలు, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా సేవలు, స్టోరేజీ, బ్రాడ్‌కాస్టింగ్‌, సమాచార సేవలు, ఆర్థిక సేవలు, రియల్‌ ఎస్టేట్‌, ప్రజాపాలన, ఇతర సేవల రంగాల్లో జీఎస్‌వీఏ పెరిగింది.

ఇదీ చూడండి: Vaccination: జంటనగరాల్లో నేటి నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్​​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.