ETV Bharat / state

మరో వారం రోజులే గడువు - జోష్​ మీదున్న కాంగ్రెస్ - బీఆర్ఎస్​పై విమర్శలే అస్త్రంగా ప్రచారం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 9:38 AM IST

Telangana Assembly Elections 2023
Congress Speed Up in Election Campaign

Congress Speed Up Election Campaign in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రచార ఘట్టానికి వారం రోజులే సమయం మిగిలి ఉండడంతో.. కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ సంఖ్యలో ఏఐసీసీ నాయకులు ..తెలంగాణలో మకాం వేయనున్నారు. అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న హస్తం పార్టీ.. విపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ.. ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. 24న ప్రియాంక గాంధీ, 25న రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, అగ్రనేతలు సైతం తరలి వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రచార పర్వానికి వారం రోజులే ఉండడంతో దూకుడు పెంచిన కాంగ్రెస్‌

Congress Speed Up Election Campaign in Telangana : తెలంగాణలో అధికారం తమదేనని పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. రాష్ట్రంపై ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో తెలంగాణకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం అంతా తరలివస్తోంది. ప్రచారానికి వారం రోజులే సమయం మిగిలి ఉండడంతో.. ఇప్పటి వరకు పర్యటించని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.

కేసీఆర్​ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి

ని‌న్న ఒక్కరోజే.. ఏడు నియోజకవర్గాల్లో మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో స్థానిక అంశాలనే ఎక్కువగా ప్రస్తావించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy) .. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్‌ను ఓడించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయనను ఓడిస్తే ఇందిరమ్మ ఇళ్లు ప్రతి పేదవాడికి ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఎన్నికల బరిలో 80 స్థానాలకు ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

Congress Top Leaders Election Campaign in Telangana : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అధిక సంఖ్యలో వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతల కోసం.. అవసరమైన ఆరు హెలికాప్టర్‌లను ఇప్పటికే పీసీసీ సిద్ధం చేసింది. నిన్న అలంపూర్‌, నల్గొండ ప్రచార సభల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge) ..ఈ నెల 25న మళ్లీ తెలంగాణకు రానున్నారు. 26, 27 తేదీల్లో పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఈ నెల 24న రాష్ట్రానికి వస్తున్నారు. 27 వరకు ఇక్కడే ఉండి.. హస్తం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

Telangana Congress Campaign in 2023 : ఈ నెల 25న రాష్ట్రానికి రానున్న రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. 28 వరకు ప్రచార సభలతోపాటు, హైదరాబాద్‌లో రోడ్‌ షోలో పాల్గొంటారు. చివరి రోజున.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) కూడా.. ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్​, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, జైరాం రమేశ్‌తోపాటు.. పలువురు ఏఐసీసీ అగ్రనాయకులు రాష్ట్రానికి రానున్నారని పీసీసీ వెల్లడించింది. అయితే వీరికి సంబంధించిన పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో - ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మాస్టర్ ప్లాన్

Telangana Assembly Elections 2023 : ఇప్పటికే రాష్ట్రంలో మకాం వేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు, కులాలవారీగా ఓటర్లు, కుల సమీకరణాలకు స్థానికంగా తీసుకున్న చర్యలతో పాటు.. ఆరు గ్యారెంటీలు (Congress six Guarantees) ఇంటింటికి చేరాయా లేదా అనే అంశాలపై దృష్టి సారించారని తెలుస్తోంది. పోలింగ్‌ తేదీ నాటికి ఓటర్లను హస్తం పార్టీ వైపు ఆకర్షించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, ఇతర పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి.. తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరో మూడు నాలుగు రోజులు తెలంగాణలోనే ఉండి.. పది జిల్లాల్లో సమీక్షలు పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

'డబ్బులకు అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు'

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే - కులగణన చేపడతాం : రాహుల్​ గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.