ETV Bharat / state

'కేసీఆర్ ఏదీ శాశ్వతం కాదు... ఏదో ఒకరోజు మేమూ అధికారంలోకి వస్తాం'

author img

By

Published : Oct 5, 2020, 5:04 PM IST

ఎల్​ఆర్​ఎస్​ కట్టకపోతే.. రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు మీకెవరిచ్చారంటూ.. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పేదలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే క్రమబద్ధీకరించాలని సూచించారు.

congress-leaders-serious-on-lrs-scheme-in-telangana-at-gandhi-bhavan
'కేసీఆర్ ఏమి శాశ్వతం కాదు... ఏదో ఒకరోజు మేము అధికారంలోకి వస్తాం'

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​ వల్ల ప్రజలపై అధిక భారం పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికే... పన్నుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

''ఎల్‌ఆర్‌ఎస్ వల్ల ప్రజలపై అధిక భారం పడింది. భయంకరంగా పన్నులు వేసి ప్రజలను పీడిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్లు చేయబోమని ప్రభుత్వం బెదిరిస్తోంది. అసలు రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? పేదలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే వాటిని క్రమబద్ధీకరించాలి. తెచ్చిన అప్పులు తీర్చడానికే ప్రజలపై భారం మోపుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ శాశ్వతం కాదు... మేము కూడా అధికారంలోకి వస్తాం. ఎవరూ ఎల్​ఆర్​ఎస్​ కట్టకండి. మేము అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తాం.''

- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

'కేసీఆర్ ఏమి శాశ్వతం కాదు... ఏదో ఒకరోజు మేము అధికారంలోకి వస్తాం'

''ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వమే కదా... మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ఎందుకు కట్టాలి. ప్రజలు ఎల్​ఆర్​ఎస్​ కట్టే భారాన్ని మీద వేసుకోకుండా... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించండి. మీకు తోడుగా మేము ఉన్నాం.''

- జగ్గారెడ్డి, ఎమ్మెల్యే

''ఆస్తుల ఆన్‌లైన్ పేరిట ప్రభుత్వం కుట్ర చేస్తోంది. గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరూ భయపడొద్దు మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రజలు ఎల్​ఆర్​ఎస్​ భారం మీద వేసుకోకండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా... ఇలాంటి ఇబ్బందులు ఉండవు.''

- సీతక్క, ఎమ్మెల్యే

ఇవీ చూడండి: ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.