ETV Bharat / state

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు: కాంగ్రెస్​

author img

By

Published : Jul 28, 2021, 10:33 PM IST

congress
కాంగ్రెస్​

ఇందిరా పార్కు వద్ద అత్యూత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. ఈ మేరకు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజన్​ కుమార్​ యాదవ్​, ఎమ్మెల్యే శ్రీధర్​ బాబుతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఇందిరా పార్కు వద్ద అత్యూత్సాహం ప్రదర్శించి.. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ గాయాలపాలవడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిచారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్​ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. డీజీపీని కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈనెల 22వ తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇందిరా పార్కు వద్ద సోనియా, రాహుల్‌ గాంధీ ఫోన్ల ట్యాపింగ్‌నకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత బాధాకరమన్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. కానీ కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. కేసులు పెట్టి వేధిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీకి వినతి పత్రం అందచేసిన కాంగ్రెస్‌ నేతలు... మునుగోడు శాసన సభ్యుడు రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాజగోపాల్​ను అవమాన పరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

'ఛలో రాజ్​భవన్​ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్​ చేశారు. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు వెంకట్​ను కింద పడేసి దాడి చేశారు. అతన్ని అరెస్ట్​ చేశారు. ఊపిరి అందడం లేదని చెబితే ఒక్కడినే రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.'

-అంజన్​ కుమార్​ యాదవ్​, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్

'అఖిలభారత కాంగ్రెస్​ కమిటీ పిలుపు మేరకు.. రాష్ట్ర కాంగ్రెస్​ పక్షన ధర్నా నిర్వహించాం. గవర్నర్​కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే కొంత మంది పోలీసులు అత్యూత్సాహం ప్రదర్శించారు. ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు వెంకట్​ పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించారు. వారిపై చర్యలు తీసుకోవాలి.'

-శ్రీధర్​ బాబు, మంథని ఎమ్మెల్యే

పోలీసులు అత్యూత్సాహం ప్రదర్శించారు: కాంగ్రెస్​

ఇదీ చదవండి: Srisailam dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Cheating: పెట్టుబడి పెడితే కమీషన్ అంటూ.. కోటికి ముంచిన అర్చకుడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.