ETV Bharat / state

మూడు కస్టర్లుగా తెలంగాణ విభజన : సీఎం రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 7:11 PM IST

Updated : Jan 6, 2024, 8:12 PM IST

CM Revanth Reddy Review
CM Revanth Reddy Review on Industries Department

CM Revanth Reddy Review on Industries Department : తెలంగాణను మూడు కస్టర్లుగా విభజించనున్నామని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఔటర్​ రింగ్​ రోడ్డు లోపల అర్బన్​ క్లస్టర్​, ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతం సెమీఅర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ప్రాంతం రూరల్ క్లస్టర్లుగా విభజిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

CM Revanth Reddy Review on Industries Department : పెట్టుబడులు ఆహ్వానించేలా తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్​ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కొత్త ఫార్మా విలేజీలు నిర్మిస్తామని తెలిపారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ భవిష్యత్​ లక్ష్యంతో మెగా మాస్టర్​ పాలసీ(Mega Master Policy) రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా రాష్ట్రం పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని మాటిచ్చారు. పారిశ్రామికాభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరగాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్​ వలే అభివృద్ధి చెందాలన్నారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనేది తమ లక్ష్యమని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో పరిశ్రమ శాఖపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మొదటిగా ఔటర్​ రింగ్​రోడ్డు(Outer Ring Road) లోపల అర్బన్​ క్లస్టర్, రెండోది ఓఆర్​ఆర్​, ఆర్​ఆర్​ఆర్​ మధ్య ప్రాంతం సెమీ అర్బన్​ క్లస్టర్​గా, మూడోది రీజనల్​ రింగ్​ రోడ్డు తర్వాత ప్రాంతం రూరల్​ క్లస్టర్​గా విభజించినట్లు సీఎం వివరించారు. ఫార్మాసిటీపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఒకేచోట ఫార్మాసిటీ కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తామన్నారు. ఓఆర్​ఆర్​కు 14 రేడియల్​ రోడ్లు, 12 హైవేల కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఓఆర్​ఆర్​, హైవేలకు దగ్గరలో ఉండేలా ఫార్మా విలేజ్​లు ఏర్పాటు చేస్తామన్నారు. 1000 నుంచి 3000 ఎకరాలకొక ఫార్మా విలేజ్​ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా ఫార్మా పరిశ్రమలు ఉండాలని సూచించారు. కాలుష్యం లేకుండా పరిశ్రమలు, స్కూల్స్​, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Review Bulk Drug Companies Associations : జహీరాబాద్​లో ఐటీ, ఫార్మా, హెల్త్​, ఫుడ్​ ప్రాసెసింగ్​ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. వీటితో పాటు స్పోర్ట్స్​, ఆటోమొబైల్​, ఆర్గానిక్​ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసారు. రక్షణ, నావికా రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా సోలార్​ పవర్​ పాలసీ(Solar Power Policy)ని రూపొందిస్తామని, ఈ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం వలే యువతను భారంగా భావించటం లేదన్నారు. పరిశ్రమల అభివృద్ధిలో యువత భాగస్వాములయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. యువతలో నైపుణ్యాల పెంపునకు స్కిల్స్​ యూనివర్సిటీలు పెడతామని వ్యాఖ్యానించారు. స్కిల్​ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన వారికి ఉపాధి లభించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయం అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునేలా విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచుతామని సీఎం రేవంత్​ రెడ్డి పరిశ్రమల శాఖపై నిర్వహించిన సమీక్షలో తెలిపారు.

Welspun Ready for Investments in Telangana : తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు వెల్‌ స్పాన్(Welspun) గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని వెల్‌స్పాన్ గ్రూప్‌ ఛైర్మన్​ బీకే గోయెంకా కలిశారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం తెలిపారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

తమ కంపెనీ చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవలలో 250 కోట్ల పెట్టుబడి పెడతామని స్పాన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయంకా తెలిపారు. రెండో, మూడో శ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహిస్తామని వికారాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాల్లోని యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని గోయంకా తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్​ శాంతి కుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్​ రెడ్డి, ఐటీ కార్యదర్శి జయేశ్​ రంజన్​, ప్రత్యేక కార్యదర్శి విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్​ సోనితో సీఎం రేవంత్​ రెడ్డి

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated :Jan 6, 2024, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.