CM KCR: ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు: కేసీఆర్​

author img

By

Published : Oct 18, 2021, 4:16 PM IST

Updated : Oct 18, 2021, 5:08 PM IST

CM KCR: ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు: కేసీఆర్​
CM KCR: ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు: కేసీఆర్​ ()

బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని.. ఏం సాధించామన్నదే ముఖ్యమన్నారు. వెనకబడిన వర్గాలను బాగుచేసుకునేందుకు యావత్‌ తెలంగాణ ఏకంకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్​లో మోత్కుపల్లి తెరాసతో చేరిన సందర్భంగా దళితుల అభివృద్ధికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తని, తనకు అత్యంత సన్నిహితుడని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఇద్దరం కలిసి అనేక ఏళ్లు కలిసి పనిచేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో విద్యుత్ కోసం తెలంగాణ ఇబ్బందులు పడిందన్న కేసీఆర్​.. విద్యుత్‌ మంత్రిగా చేసిన మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసన్నారు. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్​ పార్టీలోకి ఆహ్వానించారు.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం..

స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించామని.. ఆ ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కేసీఆర్​ వెల్లడించారు. ఆ సమయంలో తనను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర మద్దతు కోసం మాయావతిని 13 సార్లు కలిశానన్నారు. తెలంగాణలో సమస్యలు కొలిక్కి వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతులు, చేనేతల ఆత్మహత్యలు ఆగిపోయాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెరాసకు రాజకీయం ఒక యజ్ఞమని.. మిగతావాళ్లకు ఆట అని కేసీఆర్‌ విమర్శించారు.

మోత్కుపల్లితో స్నేహం రాజకీయాలకు అతీతం

మోత్కుపల్లికి కరోనా వచ్చినప్పుడు వైద్యులతో మాట్లాడానన్న సీఎం.. ఆయన వైద్యానికి రూ.కోటి ఖర్చయినా పర్లేదని చెప్పానని పేర్కొన్నారు. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతమని తెలిపారు. దళితబంధుతో ఈ సంక్షేమం ఆగదని.. అన్ని వర్గాల కోసం పనులు కొనసాగుతాయన్నారు. దళితబంధు భేటీలకు మోత్కుపల్లి హాజరయ్యారన్నారు. కొన్ని సరిహద్దు ప్రాంతాలు తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నాయని వెల్లడించారు. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కేసీఆర్‌ అన్నారు. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని.. ఏం సాధించామన్నదే ముఖ్యమన్నారు. వెనకబడిన వర్గాలను బాగుచేసుకునేందుకు యావత్‌ తెలంగాణ ఏకంకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

దళిత సమాజం దిక్సూచి కావాలి..

దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు పెట్టాలని యోచన ఉందని సీఎం కేసీఆర్​ తెలిపారు. రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడి రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తుందన్నారు. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుందని.. ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్ల ఖర్చు పెద్ద విషయం కాదన్నారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. అంబేడ్కర్‌ పుణ్యమా అని ఎస్సీలకు రిజర్వేషన్‌ ఫలాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ సాధన వంటిదే దళితబంధు యజ్ఞమని కేసీఆర్​ స్పష్టం చేశారు. ప్రాణం పోయినా దళితబంధును ఆపేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాసనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోత్కుపల్లి సేవలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. గత ప్రభుత్వాలు పోడు సమస్యను పరిష్కరించలేదని.. వాటి పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ గుడులను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రేపు యాదాద్రికి వెళ్లనున్నామని.. ఈ పర్యటనకు మోత్కుపల్లిని కూడా ఆహ్వానించామన్నారు. దళితబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుంటాయని.. పథకం అమలులో ఎవరికి అధికారం ఉండదన్నారు. కేవలం కమిటీలు మాత్రమే దళితబంధును అమలు చేస్తాయని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

'తెరాసకు రాజకీయం ఒక యజ్ఞం.. మిగతావాళ్లకు ఒక ఆట. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారం అని ఉద్యమం ప్రారంభించాను. స్వరాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నన్ను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదు. స్వరాష్ట్ర మద్దతు కోసం మాయావతిని 13 సార్లు కలిశాను. తెలంగాణలో ఇప్పుడిప్పుడే సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. రైతులు, చేనేతల ఆత్మహత్యలు ఆగిపోయాయి. ముందుముందు మరింత చేయాల్సి ఉంది. అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి. కొన్ని ప్రాంతాలు తెలంగాణలో విలీనం కోరుతున్నాయి. దళితబంధు భేటీలకు మోత్కుపల్లి హాజరయ్యారు. దళితబంధు పథకానికి రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని యోచన ఉంది. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుంది. ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదు. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడి రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తుంది. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. వచ్చే ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుంది. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి’ -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు: కేసీఆర్​

ఇదీ చదవండి: CM KCR VISIT TO YADADRI : రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

Last Updated :Oct 18, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.