ETV Bharat / state

20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్‌: కేసీఆర్​

author img

By

Published : Oct 29, 2020, 5:35 PM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 20 రోజుల్లో ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఓపెన్ ప్లాట్లు సహా ఆస్తుల వివరాలన్నీ నమోదు చేసుకోవాలని... అది వారికే మంచిదని సీఎం అన్నారు.

cm kcr said within 20 days non-agricultural assets for Registration started
20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్‌: కేసీఆర్​

ధరణి పోర్టల్‌ ద్వారా 20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. ఓపెన్ ప్లాట్లు సహా అన్ని రకాల ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రతి ఆస్తిని ప్రభుత్వం వద్ద నమోదు చేయాలని సీఎం తెలిపారు.

ప్రజల విజ్ఞప్తి మేరకు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు బహిర్గతం చేయకుండా ఉంచుతామని హామీ ఇచ్చారు. సంపూర్ణ భూ హక్కు యాజమాన్య చట్టం తీసుకువస్తామని దానికి రెండేళ్ల సమయం పడుతుందని తెలిపారు. దుబ్బాకలో తెరాస మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : స్లాట్‌ బుకింగ్‌ నుంచి పాస్‌బుక్‌ పొందే వరకు అంతా ఆన్​లైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.