ఈనెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు: కేసీఆర్

author img

By

Published : Jul 5, 2022, 7:40 PM IST

Updated : Jul 5, 2022, 9:01 PM IST

CM KCR review on the solution of Dharani problems in telangana
ధరణి సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ సమీక్ష ()

19:38 July 05

రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీఎం సమీక్ష

CM KCR review on Dharani problems: పెండింగ్‌లో ఉన్న భూరికార్డులు, భూసమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మిగిలిన భూరికార్డుల సమస్యల పరిష్కారం, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

భూసమస్యల పరిస్థితి, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున వంద బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుల నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు.

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ ప్రగతిభవన్‌లో అవగాహనా సదస్సు నిర్వహించనున్నారు. అవగాహనా సదస్సుకు మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.

ఇదీ చూడండి: ఇంటర్‌ స్థాయికి గురుకులాలు.. సీఎం కేసీఆర్ సమీక్ష

Last Updated :Jul 5, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.