ETV Bharat / state

Live Updates: రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా: సీఎం కేసీఆర్‌

author img

By

Published : May 22, 2022, 4:31 PM IST

Updated : May 22, 2022, 5:26 PM IST

CM KCR
CM KCR

17:25 May 22

  • జవాన్ల కుటుంబాలకు చెక్కులు అందజేస్తున్న సీఎం కేసీఆర్‌
  • గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం

17:11 May 22

భాజపాను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు: సీఎం

  • ఇది చాలా బాధాకరమైన సందర్భం: సీఎం కేసీఆర్‌
  • రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదు: సీఎం
  • కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారు: సీఎం
  • రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా: సీఎం కేసీఆర్‌
  • దేశ చరిత్రలో పంజాబ్‌ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారు: కేసీఆర్
  • ఎందరో వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారు: సీఎం
  • హరితవిప్లవంతో పంజాబ్‌ రైతులు దేశం ఆకలిని తీర్చారు: సీఎం కేసీఆర్
  • సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారు: సీఎం
  • కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోంది: సీఎం
  • సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోంది: సీఎం
  • భాజపాను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు: సీఎం


17:04 May 22

రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయి: దిల్లీ సీఎం

  • దిల్లీ సరిహద్దులో రైతులు ఏడాదికి పైగా పోరాటం చేశారు: దిల్లీ సీఎం
  • రైతుల ఉద్యమం పంజాబ్‌, హరియాణాకు చెందినది కాదు: కేజ్రీవాల్
  • యావత్‌ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారు: దిల్లీ సీఎం
  • రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయి: దిల్లీ సీఎం
  • ఆందోళనలో పాల్గొన్న రైతులకు దిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది: కేజ్రీవాల్‌
  • ఎండ, వాన, చలితో ఇబ్బంది పడిన రైతులకు సహాయం చేయగలిగాం: కేజ్రీవాల్

17:01 May 22

కేసీఆర్‌, కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు: భగవంత్ మాన్‌

  • రైతుల ఉద్యమానికి కేసీఆర్‌, కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు: భగవంత్ మాన్‌
  • రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతుగా నిలిచాయి: పంజాబ్‌ సీఎం

16:47 May 22

  • రైతులు, జావాన్ల కుటుంబాలను పరామర్శించిన సీఎం కేసీఆర్‌
  • చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలకు పరామర్శ
  • కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌, దిల్లీ, పంజాబ్‌ సీఎంలు

16:27 May 22

దిల్లీ నుంచి చండీగఢ్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

  • చండీగఢ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్‌ వెళ్లిన సీఎం కేసీఆర్‌
  • చండీగఢ్‌లో రైతు కుటుంబాలను పరామర్శిస్తున్న సీఎంలు
  • సాగుచట్టాలపై పోరులో అమరులైన కుటుంబాలకు ఆర్థికసాయం
  • రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళి అర్పించిన సీఎంలు
  • రైతులు, సైనికుల కుటుంబాలకు చెక్కులు అందజేస్తున్న సీఎం కేసీఆర్‌
  • 600 కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తున్న సీఎం
  • కిసాన్‌, జవాన్‌ కుటుంబాలకు చెక్కులు అందజేస్తున్న సీఎం
  • దిల్లీ, పంజాబ్‌ సీఎంల సమక్షంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం

14:56 May 22

జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై నేతలతో చర్చలు

  • ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌ పర్యటన
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్
  • విందు భేటీలో పలు అంశాలపై కేసీఆర్‌, కేజ్రీవాల్‌ చర్చలు
  • జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై ఇరువురు నేతల చర్చలు
  • దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై సీఎంల చర్చ
  • దిల్లీ నుంచి చండీగఢ్‌ బయల్దేరిన ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్‌
  • సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శించనున్న సీఎంలు
  • చండీగఢ్‌లో రైతులు, సైనికుల కుటుంబాలకు చెక్కులు అందించనున్న కేసీఆర్‌
  • 600 వందల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించనున్న కేసీఆర్
  • కార్యక్రమంలో పాల్గొననున్న పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్
Last Updated :May 22, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.