ETV Bharat / state

యూసఫ్​గూడ చెక్​పోస్ట్​ వద్ద రణరంగం.. తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ

author img

By

Published : Oct 27, 2022, 6:32 PM IST

Clash Between BJP and TRS Leaders: హైదరాబాద్​లోని యూసఫ్​గూడ చెక్​పోస్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భాజపా, తెరాస నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై రెండు పార్టీలు పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Clash between Bjp and Trs Leaders
Clash between Bjp and Trs Leaders

Clash Between BJP and TRS Leaders: హైదరాబాద్‌ యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వద్ద తెరాస-భాజపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై రెండు పార్టీలు పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. భాజపా శ్రేణులను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. తెరాస-భాజపా కార్యకర్తలను చెదరగొట్టారు.

తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.