ETV Bharat / state

ఉద్యోగులు, సిబ్బంది జాబితాను సీఈసీకి అందించండి: సీఎస్​

author img

By

Published : Nov 20, 2020, 7:05 PM IST

ఉద్యోగులు, సిబ్బంది జాబితాను సీఈసీకి అందించండి: సీఎస్​
ఉద్యోగులు, సిబ్బంది జాబితాను సీఈసీకి అందించండి: సీఎస్​

జీహెచ్​ఎంసీ ఎన్నికల విధులకు ఎక్కువ ఉద్యోగులు, సిబ్బంది అవసరం అవుతారు. ఇందుకనుగుణంగా సెక్రటేరియట్​, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల స్టాఫ్​, అధికారులను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగులు, సిబ్బంది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు.

సెక్రటేరియట్​, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని వివిధ హెచ్​వోడీ, స్పెషల్​ చీఫ్ సెక్రటరీలు, సెక్రటరీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల విధులకు ఎక్కువ మంది కావాల్సి ఉన్న దృష్ట్యా సెక్రటేరియట్, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల స్టాఫ్, అధికారులను ఉపయోగించుకోవాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలిచ్చారు.

రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్ను, ఎక్సైజ్ తదితర పన్ను సంబంధింత కార్యకలాపాల శాఖల ఉద్యోగులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.