ETV Bharat / state

AP Ganja issue: మూడేళ్లలో మూడు రెట్లు.. రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

author img

By

Published : Dec 2, 2021, 10:13 AM IST

Central Minister Replied on Ganja: పార్లమెంటులో జరుగుతున్న శీతాకాలం సమావేశాల్లో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. ఏపీలో గంజాయికి సంబంధించి లేవనెత్తిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ బదులిచ్చారు. ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం.. మూడేళ్లలో మూడురెట్లు పెరిగిందని నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు.

AP Ganja issue, central minister replied on ganja
ఏపీలో గంజాయి కేసులు

Kanakamedala at Rajya Sabha: ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం.. మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ బుధవారం అడిగిన ప్రశ్నకు.. ఆయన సమాధానమిచ్చారు.

2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు 33,930.5 కిలోలు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద స్వాధీనం చేసుకోగా.. 2019లో అది 66,665.5 కిలోలకు, 2020లో ఏకంగా 1,06,042.7 కిలోలకు చేరిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో గంజాయి సాగును అడ్డుకోవడానికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో పలు చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

AP Ganja issue, central minister replied on ganja
ఏపీలో గంజాయి కేసుల వివరాలు

ఇదీ చదవండి: Ganja Seized in Sangareddy : తుక్కు కింద గంజాయి మూటలు.. పక్కా సమాచారంతో సీజ్

AP HIGH COURT ON DRUGS CASE: 'మాదకద్రవ్యాల కేసుల్లో.. పెద్ద తలకాయలను పట్టుకోరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.